న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ: పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

Vijay Hazare: Mumbais Yashasvi Jaiswal youngest batsman to hit double hundred in List A cricket

హైదరాబాద్: లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన యువ క్రికెటర్‌గా ముంబైకి చెందిన 17 ఏళ్ల యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. విజయ్ హాజారే ట్రోఫీ గ్రూప్-ఏ మ్యాచ్‌ల్లో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఈ రికార్డు నెలకొల్పాడు.

బెంగళూరు వేదికగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టులో యశస్వి జైస్వాల్ 154 బంతుల్లో 12 సిక్సులు, 17 ఫోర్ల సాయంతో 203 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. కాగా, లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా యశస్వి నిలిచాడు.

'ది హండ్రెడ్‌' టోర్నీలో హేమాహేమీలు: అత్యధిక ధర జాబితాలో గేల్, స్మిత్'ది హండ్రెడ్‌' టోర్నీలో హేమాహేమీలు: అత్యధిక ధర జాబితాలో గేల్, స్మిత్

యశస్వి జైస్వాల్ ఇప్పటికే కేరళ, గోవా జట్లపై రెండు సెంచరీలు సాధించాడు. భారత్ అండర్-19 జట్టుకు కూడా జైశ్వాల్ ప్రాతినిధ్యం వహించాడు. గతంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గోవాతో మ్యాచ్‌లో 212 పరుగులు చేసి నాటౌట్ నిలిచిన సంగతి తెలిసిందే.

యశస్వి జైస్వాల్ కంటే ముందు కేవీ కౌశల్, సంజూ శాంసన్‌లు ఈ ఘనత సాధించారు. యశస్వి డబుల్ సెంచరీతో ముంబై జట్టు 358/3 పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన అండర్-19 ముక్కోణపు సిరిస్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి యశస్వి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

విజ్జీ వన్డే ట్రోఫీ పేరిట జరిగిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 224 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని అందుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ ఆదిత్య తారే(78) పరుగులతో రాణించడంతో తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియా సొంతం.. డెడ్‌ వికెట్లపై కూడా రాణిస్తున్నారు!!ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియా సొంతం.. డెడ్‌ వికెట్లపై కూడా రాణిస్తున్నారు!!

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సిద్ధార్ద్ లాడ్ (32) పరుగులు చేయగా... రెండో వికెట్‌కు ఇద్దరూ కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌కి ముందు ఇదే వేదికలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 16, 2019, 17:43 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X