For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ: పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

Vijay Hazare: Mumbais Yashasvi Jaiswal youngest batsman to hit double hundred in List A cricket

హైదరాబాద్: లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన యువ క్రికెటర్‌గా ముంబైకి చెందిన 17 ఏళ్ల యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. విజయ్ హాజారే ట్రోఫీ గ్రూప్-ఏ మ్యాచ్‌ల్లో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఈ రికార్డు నెలకొల్పాడు.

బెంగళూరు వేదికగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టులో యశస్వి జైస్వాల్ 154 బంతుల్లో 12 సిక్సులు, 17 ఫోర్ల సాయంతో 203 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. కాగా, లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా యశస్వి నిలిచాడు.

యశస్వి జైస్వాల్ ఇప్పటికే కేరళ, గోవా జట్లపై రెండు సెంచరీలు సాధించాడు. భారత్ అండర్-19 జట్టుకు కూడా జైశ్వాల్ ప్రాతినిధ్యం వహించాడు. గతంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గోవాతో మ్యాచ్‌లో 212 పరుగులు చేసి నాటౌట్ నిలిచిన సంగతి తెలిసిందే.

యశస్వి జైస్వాల్ కంటే ముందు కేవీ కౌశల్, సంజూ శాంసన్‌లు ఈ ఘనత సాధించారు. యశస్వి డబుల్ సెంచరీతో ముంబై జట్టు 358/3 పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన అండర్-19 ముక్కోణపు సిరిస్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి యశస్వి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

విజ్జీ వన్డే ట్రోఫీ పేరిట జరిగిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 224 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని అందుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ ఆదిత్య తారే(78) పరుగులతో రాణించడంతో తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సిద్ధార్ద్ లాడ్ (32) పరుగులు చేయగా... రెండో వికెట్‌కు ఇద్దరూ కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌కి ముందు ఇదే వేదికలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 16, 2019, 17:43 [IST]
Other articles published on Oct 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+