Vijay Devarakonda vs Tilak Verma: ఐపీఎల్ 2025లో తొలి వైఫల్యాల తర్వాత ముంబై ఇండియన్స్ బలంగా పునరాగమనం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లాలని యత్నిస్తోంది. ఈ సీజన్‌లో ముంబై అద్భుతంగా రాణించడంలో విధ్యంసక బ్యాటర్ తిలక్ వర్మ కూడా ప్రత్యేక సహకారం అందించాడు. ఇదిలా ఉండగా ఈ కీలక మ్యాచ్‌కు ముందు.. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు తిలక్ వర్మ, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పికిల్ బాల్ ఆడి సందడి చేసారు.
హీరో విజయ్ దేవరకొండ సరదాగా ఒక ఛాలెంజ్ కూడా చేశాడు. బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబై ఇండియన్స్ జెర్సీని ధరిస్తానని తిలక్ వర్మకు విజయ్ దేవరకొండ ఛాలెంజ్ విసిరారు. అయితే పికిల్ బాల్ మ్యాచ్‌లో విజయ్ దేవరకొండ టీమ్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. ఈ వీడియోపై టీమిండియా క్రికెటర్లు, సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై జట్టు తనదైన ఆటతో ఇప్పుడు దూసుకుపోతోంది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ప్లేఆఫ్స్ రేసులోకి బలంగా దూసుకొచ్చింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 4 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.