గేల్ సెంచరీ..: యువీ గంగ్నమ్ డ్యాన్స్, ప్రీతి జింటా చప్పట్లు (వీడియో)


హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి పంజాబ్-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ 63 బంతుల్లో 11 సిక్సులు, ఒక ఫోర్ సాయంతో 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్ 11వ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడని గేల్... చెన్నైతో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చీ రాగానే 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గేల్ కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు.
ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయం
ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ అనంతరం హోటల్‌కు చేరుకున్న పంజాబ్ ఆటగాళ్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న గేల్ చేత సహచర ఆటగాళ్ల కేక్ కట్ చేయించారు.

హైదరాబాద్‌పై 15 పరుగుల తేడాతో విజయం
ఇందుకు సంబంధించిన వీడియోను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 178/4కే పరిమితమైంది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
యువరాజ్ సింగ్ గంగ్నమ్ డ్యాన్స్
ఇదిలా ఉంటే గురువారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ సెంచరీ పూర్తి చేసిన వేళ పంజాబ్ జట్టు సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా చప్పట్లతో హర్షం వ్యక్తం చేయగా.. డగౌట్‌లో కూర్చున్న యువరాజ్ సింగ్ గంగ్నమ్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
ప్రీతి జింటా సెల్ఫీ దిగిన యువరాజ్
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘గంగ్నమ్' స్టైల్లో స్టెప్పులేసి అదరగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గేల్‌తో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా సెల్ఫీ దిగి తన ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘ఈ సీజన్‌లో మొదటి శతకం, రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న గేల్‌తో.. థాంక్ గాడ్' అని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications