Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలా వెళ్తే జనం రాళ్లతో కొడతారు: ధోనీ(వీడియో)

ఢిల్లీ: మరో రెండు నెలల్లో మొదలయ్యే ట్వంటీ20 ప్రపంచకప్‌ కోసం స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్‌ రూపొందించిన ప్రకటనలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2015 ప్రపంచ కప్ సందర్భంగా వచ్చిన 'మౌకా మౌకా' బాగా ప్రచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో 2016 టీ20 ప్రపంచ కప్ కోసం ధోనీతో ఓ ప్రకటన చేసింది స్టార్ స్పోర్ట్స్.

రాబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం రూపొందించిన ఈ కొత్త ప్రకటన కూడా ఆసక్తి రేపుతోంది. 'జీవా(ధోనీ కూతురు) పుట్టాక నేను బోరింగ్‌గా తయారయ్యానని (విరాట్) కోహ్లీ, జడ్డూ(రవీంద్ర జడేజా) అంటున్నారు' అన్న ధోనీ మాటలతో మొదలవుతుంది ఈ ప్రకటన.

ఆ తర్వాత ధోనీ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నానీ అతడి దగ్గరికొచ్చి.. రకరకాల జుట్టు నమూనాలు చూపిస్తుంది. ప్రపంచకప్‌లో ధోని ఎలాంటి కేశాలంకరణతో బరిలోకి దిగాలనే విషయంలో ఇద్దరి మధ్య చర్చ నడుస్తుంది. మలింగ తరహా కేశాలంకరణతో ధోనీ ఉన్న చిత్రం చూపించగానే.. 'మరి మలింగ ఏం చేస్తాడు' అంటాడు ధోనీ.

మరికొన్ని విచిత్రమైన నమూనాలు చూపిస్తే.. 'ఇలా రోడ్ల మీదికి వెళ్తే జనాలు రాళ్లతో కొడతారు' అంటూ ధోనీ అసహనం వ్యక్తం చేస్తాడు. చివరగా 2007లో ప్రపంచకప్‌ గెలిచినప్పటి మహి జులపాల జుట్టును ప్రయత్నిద్దామా అంటుంది సప్నా.

కాగా, ఇది ప్రపంచకప్‌ వచ్చేస్తోందంటూ అభిమానుల్లో ఉత్సాహం తెచ్చేందుకు తయారు చేసిన ప్రకటన. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, భారత్‌ ఆతిథ్యమిచ్చే ఈ టీ20 ప్రపంచకప్‌ మార్చి 8-ఏప్రిల్‌ 3 తేదీల మధ్య జరుగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+