యాడ్: ప్రభుదేవా, ధోనీ 'లుంగీ' డ్యాన్స్ (వీడియో)
ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జనవరి 12 నుంచి ఆస్టేలియాతో పెర్త్‌లో ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరిస్‌కు సన్నద్ధమైతే, భారత్‌లో మాత్రం ధోని నటించిన వీడియో ఒకటి జనవరి 10 (ఆదివారం) ఇంటర్నెట్‌లో హాల్ చల్ సృష్టిస్తోంది.
మైదానంలో 'కెప్టన్ కూల్' గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని 'ధోతీ' తో యాడ్‌లో మాత్రం ఇరగదీశాడు. పలు తెలుగు సినిమాల్లో నటించిన హీరో, డైరెక్టర్ ప్రభుదేవాతో ధోని టీవీ యాడ్‌లో ధోతీలో అదిరిపోయే స్టెప్పులేశాడు. ధోనీ టీవీఎస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా 'టీవీఎస్ స్టార్' బైక్స్ కోసం రూపొందించిన యాడ్‌లో కెప్టెన్ ధోనీ, ప్రభుదేవాతో కలిసి ధోతీని ధరించి కాళ్లకు పనిచెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఎంతో మంది తమిళ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు.
ముఖ్యంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో వెస్టిండిస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో మైదానంలో డ్యాన్సులతో అలరిస్తుంటాడు. అయితే అభిమానులకు ధోని డ్యాన్స్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ధోని కొత్త అవతారానికి అభిమానులు సైతం మంత్ర ముగ్దులవుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications