Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో అద్భుతం: 7వ స్థానంలో వచ్చి 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. తాజాగా ఉగాండాలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 3లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అలాంటి అద్భుతమే చోటు చేసుకుంది. అప్పటి వరకు చప్పగా సాగుతున్న మ్యాచ్‌కు ఒక్కసారిగా ఊపుతీసుకొచ్చాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

7వ స్థానంలో క్రీజులోకి వచ్చి 44 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న జట్టుకు భారీ స్కోరు అందించాడు. వివరాల్లోకి వెళితే ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 3లో భాగంగా కంపాలాలోని లుగోగో క్రికెట్ ఓవెల్ మైదానంలో మే 23 (మంగళవారం) ఉగాండా, కెనడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ప్రదర్శన చోటుచేసుకుంది.

 VIDEO: Uganda Cricket Cranes embarrassed by Canada in Division 3 opener

20 ఓవర్లకు గాను కెనడా జట్టు 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెనడా బ్యాట్స్‌మన్ రిజ్వాన్ చీమా ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. చీమా విధ్వంసకర బ్యాటింగ్‌తో నిర్ణీత 42 ఓవర్లలో కెనడా 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

చీమా ఏకంగా 10 సిక్సులు, 3 ఫోర్లు బాదాడు. బ్యాటింగ్‌లో చీమా, బౌలింగ్‌లో పర్వేజ్ చెలరేగడంతో ఆతిథ్య ఉగాండాపై కెనడా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పర్వేజ్ 4 వికెట్లు తీసి 44 పరుగులిచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చీమా విధ్వంసకర ఇన్నింగ్స్ మీకోసం:

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+