Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా ఆటగాళ్లపై మనోళ్ల అభిమానం (వీడియో)

బెంగళూరు: దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిల్లీయర్స్, డుప్లెసిస్, జెపి డుమినీ తదుతరులు... భారత్ క్రికెట్ అభిమానులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెట్ పట్ల, క్రికెటర్ల పట్ల అభిమానుల ప్రేమకు ఆటగాళ్లు అచ్చెరువొందుతున్నారు.

దక్షిణాఫ్రికా ప్రస్తుతం 72 రోజుల భారత్ పర్యటనకు వచ్చింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో క్రికెట్ అభిమానులు, భద్రత కోసం ఉన్న సిబ్బంది కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. క్రికెటర్లు ఎక్కడుంటే చాలామంది అక్కడే ఉంటున్నారు.

దక్షిణాఫ్రికా - భారత్ ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మూడో వన్డేను ఆదివారం ఆడనుంది. ఆక్టోబర్ 18న రాజ్‌కోట్‌లో మూడో వన్డే ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ధర్మశాల, కటక్, కాన్పూర్, ఇండోర్ తదితర నగరాల్లోని స్టేడియాల్లో ఆడుతున్నారు.

ఇప్పటికే దక్షిణాఫ్రికా ట్వంటీ 20 సిరీస్‌ను 2-0తో గెలిచింది. వన్డే సిరీస్ 1-1తో ఉంది. వన్డేల అనంతరం నాలుగు టెస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వచ్చిన సౌతాఫ్రికా ఆటగాళ్లు భారత్ క్రికెట్ అభిమానుల ప్రేమకు పొంగిపోతున్నారు.

VIDEO: South Africa hail Indians as 'biggest fans' in cricket

డివిల్లియర్స్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో... భారత్ తమకు ప్రత్యేక స్థలం అన్నాడు. సౌతాఫ్రికాలో ఉన్న పలువురు ఆటగాళ్లు భారత్ పర్యటన గురించి ఇక్కడున్న వారిని అడుగుతున్నారు.

ప్రపంచంలో.. అలాగే ఏ ఆటను పరిగణలోకి తీసుకున్నా.. దానికి ఉండే ఫాలోయింగ్‌కు ఒక్క భారత్ క్రికెట్ అభిమానం మాత్రం పోటీ పడుతుందని అంటున్నారు.

వందలాది, వేలాది మంది క్రికెట్ అబిమానులు ఆటగాళ్లు ఉంటే హోటల్స్, ప్రయాణించే విమానాశ్రయాలు, స్టేడియాల వద్ద వరుస కడుతున్నారు. క్రికెట్ హీరోలను చూసేందుకు ఎగబడుతున్నారు. కాగా, తమను చూసేందుకు ఎగబడుతున్న అభిమానులను పలువురు ఆటగాళ్లు వీడియో తీశారు.

సౌతాఫ్రికా వాళ్ల ప్రకారం... ప్రపంచంలోనే భారతీయులు అతిపెద్ద క్రికెట్ ఫ్యాన్స్. ఆ తర్వాత బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంటుంది. డివిల్లీయర్స్‌కు (భారత్ ఆటగాళ్ల తర్వాత) భారత్‌లో మంచి ఫాలోయింగ్ ఉందని సౌతాఫ్రికా అభిమానులు కూడా చెబుతారు. డివిల్లీయర్స్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+