
హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్‌తో శ్రీలంక జట్టును కట్టుదిట్టం చేసి 172 పరుగుల తేడాతో గెలుపొందింది.
ప్రత్యక్షంగా చూసిన వారికే తప్ప ఈ మ్యాచ్‌లో మిగిలిన వారెవ్వరికీ తెలియన కీలకమైన సన్నివేశం ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ధోనీని మూడో స్థానంలో పంపమంటూ రోహిత్ శర్మ కోచ్‌కు సిగ్నల్ ఇస్తున్నాడు.
ఓ అభిమాని తన సెల్‌ఫోన్‌లో బంధించి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీనిని గమనించిన అధికార వర్గం పలు నిబంధనల రీత్యా తొలగించింది. అయితే దానిని ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు మాత్రం పంచుకుంటూనే ఉన్నారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసిన సెంచరీ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 101 పరుగులను రోహిత్ శర్మ సాధించాడు. టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.