Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊపేసిన ప్రీతి జింటా: వినూత్నంగా సంబరాలు (వీడియో)

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మంగళవారం మొహాలి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సరిగ్గా ఇలానే సాగింది.

అంతేకాదు క్రికెట్‌ అభిమానులకు సైతం మంచి వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై 14 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా చేసిన డ్యాన్స్ అందరినీ తెగ ఆకర్షిస్తోంది.

ప్రాంఛైజీ యజమానులు తమ జట్టు ఆటగాళ్లు వికెట్ తీస్తే లేదా సెంచరీ చేస్తే సంబరాలు చేసుకోవడం మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు సహ యజమాని ప్రీతి జింటా కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ వికెట్‌ పడగానే ఆనందంతో నృత్యం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోల్‌కతా 18 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన క్రమంలో ఓపెనర్ క్రిస్ లిన్ రెండో పరుగుకు యత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో ఆమె తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. ప్రీతి జింటా మాత్రం తన శరీరాన్ని అదోలా ఊపుతూ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Friday, February 23, 2018, 10:00 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+