భారత యువతిని పెళ్లాడిన పాకిస్థాన్ పేసర్: బాలీవుడ్ పాటలకు డ్యాన్స్

హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. భారత్‌కు చెందిన ఏరోనాటికల్ ఇంజినీర్ సామియా ఆర్జూను దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్‌లో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు సుమారు 30 మంది వరకు కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
వచ్చిన గెస్ట్‌ల జాబితా ఆధారంగా రెండు బాల్ రూమ్స్‌లో ఈ పెళ్లి వేడుక ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. హోయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె కొన్నాళ్ల క్రితం హసన్ అలీకి పరిచయమైంది.
వివాహ బంధంలోకి
పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. బ్లాక్ షేర్వానీలో హసన్ అలీ, రెడ్ అండ్ గోల్డ్ డ్రెస్సులో ఆర్జూ ఆకట్టుకున్నారు. వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను బుర్జ్ ఖలీఫా ముందు జరిపారు. వలీమా కూడా దుబాయ్‌లోనే నిర్వహించనున్నారు.
పాకిస్థాన్‌లో భారీ రిసెప్షన్
వివాహం అనంతరం వీరు పాకిస్థాన్‌లో భారీగా రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. 26 ఏళ్ల సమియా ఆర్జూ హర్యానాలోని నుహ్ (మేవాట్) జిల్లా చందేని గ్రామానికి చెందివారు. ఇంగ్లాండ్‌లోని మానవ్ రచన యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆమె మాజీ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని కూడా.
ఇదే మొదటిసారి కాదు
ప్రస్తుతం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఇక, సమియా ఆర్జూ తండ్రి లియాఖత్ అలీ హర్యానాలో బ్లాక్ డెవలప్‌మెంట్ అండ్ పంజాయత్ ఆపీసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అయితే, పాక్ క్రికెటర్లు భారత యువతిని పెళ్లాడటం ఇదే మొదటిసారి కాదు.
హసన్ అలీ రికార్డు ఇదీ
గతంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు భారత యువతిని పెళ్లాడిన వారి జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్, హసన్ ఖాన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. హసన్ అలీ(25) 53 వన్డేలు ఆడి 82 వికెట్లు తీశాడు. 9 టెస్టు మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications