Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ అవుటా? కాదా?: ఎల్బీడ‌బ్ల్యూ నిర్ణయంపై చర్చ (వీడియో)

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతగా కలిసి రావడం లేదు. తొలి టెస్టులో 333 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో కూడా ఏమంత ఆశాజనకంగా ఆడటం లేదు. తొలి టెస్టు ఓటమితో టీమిండియా వరుస విజయాలకు కూడా బ్రేక్ పడింది.

ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. డీఆర్ఎస్ విధానం కోహ్లీసేనకు పెద్దగా కలిసి రావడం లేదు. తాజాగా బెంగుళూరు వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ దుర‌దృష్ట‌వ‌శాత్తు అవుటయ్యాడు.

హెజిల్ ఉడ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎల్బీడ‌బ్ల్యూగా అవుటైనట్లు అంఫైర్ ప్రకటించాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హజెల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో స్పిన్ బౌలింగ్‌లో అవుటైన కోహ్లీ, ఈసారి మాత్రం పాస్ట్ బౌలర్‌ హజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

Video: Out or not out? Virat Kohli falls to controversial LBW decision

కానీ అది ఇన్‌సైడ్ ఎడ్జ్ అని బలంగా న‌మ్మిన కోహ్లీ వెంట‌నే రీవ్యూ కోరాడు. ఆ త‌ర్వాత రీప్లేల్లో అది స్ప‌ష్టంగా క‌నిపించ‌లేదు. రివ్యూలో రెండు శబ్ధాలు వినిపించాయి. కానీ బంతి మొద‌ట బ్యాట్‌ను తాకిందా? లేక ప్యాడ్‌నా అన్న‌ది స్ప‌ష్టంగా క‌నిపించ‌లేదు. దీంతో థ‌ర్డ్ అంపైర్ కెటిల్‌బ‌రో మాత్రం ప్యాడ్‌కు త‌గిలిన‌ట్లే భావించాడు.

తద్వారా హాక్ఐ ద్వారా బంతి గ‌మ‌నాన్ని గ‌మ‌నించి విరాట్‌ కోహ్లీని అవుట్‌గా ప్ర‌క‌టించాడు. దీనిపై కోహ్లీ స్టేడియంలో నుంచి అసంతృప్తిగానే వెనుదిర‌గాడు. ఇప్పుడు కోహ్లీ అవుట్‌పై బీసీసీఐ పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఆ ఎల్బీడ‌బ్ల్యూ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి.. మూడో అంపైర్ దీన్ని అవుటన్నాడు. మీరేమంటారు అంటూ ఫ్యాన్స్‌ని ప్ర‌శ్నించింది.

ఇదిలా ఉంటే కోహ్లీ ఎల్బీపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిపై స్పందించ‌డం విశేషం. క్రికెట్ ఆస్ట్రేలియా త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటో పోస్ట్ చేస్తూ ఇది చాలా క్లిష్టంగా ఉంద‌ని, కోహ్లీ అవుటయ్యాడని క్రికెట్ ఆస్ట్రేలియా తన పోస్టులో పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+