ఇసుకల్లో గోతులు.. జీవా స్నేహితుడిగా ధోనీ(వీడియో)

మెల్‌బౌర్న్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మాత్రమే కాదు. అతని కూతురు జీవా ధోనీ సైతం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్సీ ధోనీ వహిస్తున్న సమయంలో మైదానంలో జీవా చేసిన సందడి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ సరదాగా ఆడుకుంటూ చేసిన ప్రతి వీడియోకు అత్యంత ప్రేక్షకాదరణ లభిస్తూనే ఉంది. ఇటీవల తాజాగా మహీ అనధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చేసిన పోస్టు మరింత క్రేజీగా అనిపిస్తుండటంతో నిమిషాల్లోనే అత్యధికమంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఇసుక దొరికినప్పుడు మేం కచ్చితంగా
చిన్న పిల్లల సరదాలో భాగమైన ఇసుక ఆటల్లో ధోనీ తన కూతురికి స్నేహితుడైపోయాడు. పైగా ఇసుకలో ఆడుకుంటూ కింద ఓ కామెంట్ పెట్టాడు. ఓ చిన్న పిల్లాడిలా ఇసుక దొరికినప్పుడు మేం కచ్చితంగా చేసే పనిలో ఇదొకటి.
పాండ్యాతో కలిసి గ్రామీణ నేపథ్యంలో
ధోనీ.. ఇటీవల మరో వాణిజ్య ప్రకటనలో తనదైన శైలి సహజత్వమైన నటన చూపించాడు. ఈ సారి హార్దిక్ పాండ్యాతో కలిసి గ్రామీణ నేపథ్యమున్న యువకుని పాత్రలో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కలిసి నటించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. స్టార్ నెట్‌వర్క్ తమ చానెల్స్ ప్యాకేజీని ప్రమోట్ చేసేందుకు ఈ యాడ్‌ను రూపొందించింది.

ధోనీతోపాటు పాండ్యా భోజ్‌పురిలో
ఇందులో ధోనీతోపాటు పాండ్యా భోజ్‌పురిలో మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది. ధోనీ ఇందులో బిట్టూ భయ్యాగా కనిపించాడు. ఓ చెట్టుపై కూర్చొని బైనాక్యులర్స్‌లో దూరంగా జరుగుతున్న మ్యాచ్‌ను ఈ ఇద్దరు క్రికెటర్లు చూస్తున్నట్లుగా యాడ్‌ను చిత్రీకరించారు. ధోనీ, పాండ్యా చాలా సహజంగా నటిస్తూ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ వీడియోను పాండ్యా తన ట్విటర్‌లో షేర్ చేశాడు. కేవలం రూ.49కే స్టార్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని చానెల్స్ వస్తాయని చెప్పడమే ఈ యాడ్ ఉద్దేశం.

వన్డే సిరీస్‌కు ఎంపికైన పాండ్యా, ధోనీ
ఆస్ట్రేలియా పర్యటనకు ఇప్పటివరకు దూరమైన ఈ ఇద్దరూ వన్డే జట్టులో ఎంపికయ్యారు. త్వరలోనే టీమిండియా శిక్షణలో పాల్గొననున్నారు. ఆసియా కప్ జరుగుతుండగా హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఫిట్‌నెస్ సాధించి మళ్లీ జట్టులోకి చేరనున్నాడు. ఫామ్ లేమి కారణంగా టీమిండియాకు దూరమైన వన్డే సిరీస్‌కు ఎంపికై జట్టులో చేరనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications