Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వికెట్ల మధ్య పరుగెత్తుతూ రెండు సార్లు కిందపడ్డ క్రికెటర్ (వీడియో)

Video: Marcus Trescothick made quite a drama out of running between the wickets

క్రికెట్ ఆటలో ఏదైనా సాధ్యమే. బ్యాట్స్‌మన్‌, బౌలర్, ఫీల్డర్, కీపర్‌లు అద్భుతాలు చేస్తుంటారు. అందులో కొన్ని ఘటనలు విషాదాన్ని నింపితే.. మరికొన్ని ఘటనలు సరదాగా నవ్వులు పూయిస్తాయి. తాజాగా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్లో భాగంగా సోమర్‌సెట్, సర్రే జట్లమధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ సోమర్‌సెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరో సోమ‌ర్‌సెట్ బ్యాట్స్‌మ‌న్‌ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. నాన్‌ స్ట్రెకింగ్ ఎండ్‌లో ఉన్న మార్కస్ మొదటి పరుగు తీసేక్రమంలో.. వికెట్ల మధ్య పరుగెత్తుతూ క్రీజులో బ్యాట్ పెట్టేటప్పుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. అనంతరం రెండో పరుగు కోసం ప్రయత్నించి మళ్లీ జారి పడ్డాడు. స్ట్రెకింగ్ బ్యాట్స్‌మన్ మూడో రన్ కోసం సగం దూరం వరకు వెళ్లినప్పటికీ.. మార్కస్ పరుగుకు నిరాకరించడంతో అతను మళ్లీ క్రీజులోకి వచ్చాడు. దీంతో రెండే పరుగులు వచ్చాయి.

ఈ ఘటనతో మైదానంలో ఉన్న అంపైర్‌, ఫీల్డర్లు, బ్యాట్స్‌మన్ అందరూ నవ్వులు పూయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'ఆర్ట్‌ ఆఫ్‌ రన్నింగ్‌ బెట్వీన్‌ ది వికెట్స్‌' అని రాసాడు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఓ తోక్కేసి హాయిగా నవ్వుకోండి.

Story first published: Friday, May 10, 2019, 16:45 [IST]
Other articles published on May 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+