ఆటగాళ్లకు కింగ్‌ఫిషర్ 'మానెక్విన్ ఛాలెంజ్' (వీడియో)
హైదరాబాద్: మానెక్విన్ ఛాలెంజ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. గతేడాది టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో బొమ్మల్లాగా నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ పదో సీజన్‌లో అదే ఛాలెంజ్ మళ్లీ వచ్చింది.
ఐపీఎల్‌లో భాగంగా కింగ్‌ఫిషర్ ఆటగాళ్లకు ఈ ఛాలెంజ్ విసిరింది. మొదటగా దీనిని పుణె సూపర్ జెయింట్ జట్టు స్వీకరించింది. ఆ తర్వాత ఆ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఛాలెంజ్ విసిరింది. దానిని చూసి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా చాలెంజ్‌కు అంగీకరించాయి.
ఆటగాళ్లు బొమ్మల్లాగా నిలబడితే
ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆటగాళ్లు బొమ్మల్లాగా నిలబడితే ఓ కెమెరా వాళ్లను చిత్రీకరిస్తుంది. కెమెరా చిత్రీకరించే సమయంలో ఆటగాళ్లు ఎలా ఉన్నారో అలానే ఉండాల్సి ఉంటుంది. ఈ మానెక్విన్ ఛాలెంజ్‌కి ఇప్పుడు సోషల్ మీడియాలో పుల్ క్రేజ్ ఉంది. తొలి వీడియోలో ఈ ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్ రిలాక్స్ అవుతుండగా.. చివర్లో కెప్టెన్ స్మిత్, ధోనీ క్యారమ్స్ ఆడుతూ కనిపించారు.
జిమ్‌లో కసరత్తులు చేస్తూ
ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లేయర్స్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ మానెక్విన్ చాలెంజ్‌ను స్వీకరించారు.
సాకర్ స్కిల్స్‌ను చూపెట్టిన ముంబై ఇండియన్స్
ఇక ముంబై ఇండియన్స్ తమ సాకర్ స్కిల్స్‌ను చూపెట్టింది. హర్భజన్ సింగ్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, మిచెల్ జాన్సన్, నితీశ్ రాణా, సుచిత్ ఫ్రీజ‌్ అవగా.. రోహిత్‌శర్మ, హార్దిక్ పాండ్యా గోల్ కోసం ట్రై చేస్తున్నట్లుగా వీడియో విడుదలు చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ ఇలా
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మ్యాచ్ కోసం తమ ప్రణాళికలు రచిస్తున్న వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ బోర్డుపై ప్లాన్స్ చెబుతుండగా.. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, నెహ్రా, ఓజా సీరియస్‌గా వింటూ ఉండగా... చివర్లో యువీ కునుకు తీస్తూ కనిపించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇలా
సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి చాలెంజ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు విసిరింది. ఈ వీడియో రాబిన్ ఊతప్ప మొబైల్ చూస్తుడంగా, మనీష్ పాండే, డ్వేన్ బ్రావో టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. చివర్లో కెప్టెన్ గౌతం గంభీర్ డ్రమ్స్ మోగిస్తూ ఛాలెంజ్‌ని స్వీకరించాడు.
కిచెన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్
చివరగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించింది. పంజాబ్ జట్టు ఈ ఛాలెంజ్‌ని కిచెన్‌లో స్వీకరించడం విశేషం. ఇలా అన్ని టీమ్స్ కూడా తమ అభిమానులను ఈ మానెక్విన్ చాలెంజ్‌ను స్వీకరించి, తమ వీడియోలను పంపాల్సిందిగా కోరాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications