

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్, అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ కెమెరామెన్‌గా మారాడు. కెమెరామెన్‌గా మారిన రోహిత్ శర్మ జట్టులోని తన సహచర ఆటగాళ్లను కెమెరాలో బంధించాడు. సిరీస్‌కు ముందు ఆటగాళ్లతో తీసే ఫోటోషూట్‌లో పాల్గొన్న రోహిత్ సెల్‌ఫోన్ కెమెరాతో ఫోటోలు తీశాడు.
ఫోటోలు తీసే క్రమంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లా మనీశ్ పాండేకు సూచనలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా, ఆసీస్ గడ్డపై టీమిండియా మరో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 జరగనుంది.
టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇప్పటికే 1-0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా రెండో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... టీమిండియా మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. రెండో టీ20 కోసం టీమిండియా ఇప్పటికే మెల్‌బోర్న్‌కు చేరుకుంది.