బెంగళూరు: క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్‌లు ఓ డ్రోన్‌ను ముక్కుల చేసే సవాల్ స్వీకరించారు. అయితే, చివరకు క్రిస్ గేల్ ఇందులో విజయం సాధించాడు. బ్యాట్ పట్టి మిషన్ వేసే బంతిని వారు కొట్టి డ్రోన్‌ను ముక్కలు చేయవలసి ఉంటుంది.
ఇది ఓ భిన్నమైన సవాల్. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ కోసం ప్రచారంలో భాగంగా దీనిని తీశారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ జూన్ 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు జరగనుంది.

కాగా, బౌలింగ్ మిషన్ వీరికి బంతులు విసిరింది. క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్‌లు పైన ఉన్న డ్రోన్‌ను లక్ష్యంగా ఆ బంతులను తమ బ్యాట్‌తో కొట్టారు.
కెవిన్ పీటర్సన్ బంతి డ్రోన్‌కు చాలా దగ్గరగా వెళ్లింది. అయితే, చివరకు క్రిస్ గేల్ డ్రోన్‌ను ముక్కలు చేశాడు. ఈ టాస్క్ ఇద్దరు బ్యాట్సుమెన్‌కు అంత సులభమైనది ఏమీ కాదు. ఇరువురు కూడా పలుమార్లు ప్రయత్నాలు చేశారు. చివరకి గేల్ డ్రోన్‌ను కొట్టాడు.