Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపిక తర్వాత: మహిళల కోసం కోహ్లీ, రైనా, రాయుడు(వీడియో)

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె తర్వాత భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలతోపాటు అంబటి రాయుడు, రవిశాస్త్రిలు మహిళల సాధికారత, రక్షణ కోసం రూపొందించిన వీడియోలో కనిపించారు. ప్రతీ ఒక్కరూ మహిళలను గౌరవించాలని, వారికి తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆ వీడియో సందేశం.

ఒక నిమిషం 6 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఈ క్రికెటర్లందరూ కనిపించారు. రెస్పెక్ట్ 2 రక్షణ(రక్షణ, గౌరవం) మహిళలకు సముచిత గౌరవం కల్పించడంతోపాటు వారి రక్షణ హక్కును కాపాడాలని కోరారు.

<center><iframe width="100%" height="360" src="https://www.youtube.com/embed/UEW0gk0lhQg?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

వయస్సు భేదం లేకుండా పురుషులందరూ మహిళలను గౌరవించాలని, గౌరవం, రక్షణ పొందడం మహిళల హక్కు అని తెలిపారు. మహిళల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో మార్చి 24న మై చాయిసెస్ ద్వారా విడుదలైంది.

దీపికా పదుకొనె వివాదాస్పదమైన వీడియోవిడుదలైన తర్వాత ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. దీపికా పదుకొనె వీడియోకు కొందరు మద్దతు తెలుపగా.. మరికొందరు విమర్శలు గుప్పించారు.

Video: Deepika slammed; now cricketer Kohli, Raina fight for women

కాగా, దీపికా ఆ వీడియోలో సమాజాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. 'నా శరీరం, నా మనసు, నా ఇష్టం' అని ఆ వీడియోలో దీపిక పేర్కొంది. దీపికాతోపాటు ఇతర రంగాలకు చెందిన పలువురు మహిళలు ఆ బోల్డ్ వీడియోలో కనిపించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+