ఢాకా: బంగ్లాదేశ్ జట్టులో అద్భుతంగా రాణిస్తున్న 24 ఏళ్ల షబ్బీర్ రెహమాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అందుకు కారణం ఈ యువ ఆటగాడు నటించిన ఓ యాడ్. షబ్బీర్ రెహమాన్ నటించిన ఓ యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొవడంతో ఆ యాడ్‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండితాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో షబ్బీర్ రెహమాన్ అద్భుతంగా పోరాడాడు. అయితే సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టుపై చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునే క్రమంలో విజయానికి 22 పరుగుల దూరంలో బంగ్లాదేశ్ నిలిచిపోయింది.
దీంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టులో ఓటమి పాలైంది. అయితే తొలి టెస్టులో షబ్బీర్ రెహమాన్ అద్భుత ప్రదర్శనపై సోషల్ మీడియాలో ఆ దేశ అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతలో షబ్బీర్ రెహమాన్ నటించిన ఓ యాడ్ వీడియో యూట్యూబ్‌లో వెలుగులోకి వచ్చింది.
ఈ యాడ్‌లో 34 ఏళ్ల బంగ్లాదేశ్ హాట్ మోడల్ నైలా నయీమ్‌తో కాస్తా శృతిమించి షబ్బీర్ నటించాడు. నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అయిన ఆస్కార్‌ను ప్రమోట్ చేస్తూ ఈ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన హాట్ మోడల్ నైలా నయీమ్ షబ్బీర్ తల్లికి షాక్ ఇస్తుంది.
ఆ తర్వాత ఇంట్లోని తన ప్రైవేట్ రూంలో కూర్చుని ఇన్న షబ్బీర్ వద్దకు వెళ్తుంది. అనంతరం నైలా నయీమ్ రెచ్చగొట్టే రీతిలో కనిపిస్తూ... షబ్బీర్ చేతులకు బేడీలు వేస్తుంది. ఆ తర్వాత షబ్బీర్ ఈ డ్రింక్ తాగాలంటే కొంచెం ప్రైవసీ కావాలంటూ పేర్కొంటాడు. ఇస్లామిక్ సంప్రదాయ దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ వీడియోపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగింది.
షబ్బీర్ నటించిన ఈ యాడ్ బంగ్లాదేశ్ క్రికెట్ గౌరవాన్ని నిలబెట్టలేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ వీడియోని నిషేధించింది. ఇదిలా ఉంటే తొలి టెస్టులో బాగా రాణించి అందరి ఆదరాభిమానులు చూరగొన్న షబ్బీర్‌పై సోషల మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.