ఖాజా రికార్డు: బాబర్ ఆజాం స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్ల ఫిదా (వీడియో)

హైదరాబాద్: దుబాయి వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు అనూహ్యంగా డ్రాగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్ చివరి రోజు ఆటలో పాక్ ఆటగాడు బాబర్ ఆజాం అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 128వ ఓవర్‌లో పాక్ బౌలర్ వేసిన బంతిని మిచెల్ స్టార్క్ భారీ షాట్‌గా మలచబోయాడు. ఆ సమయంలో అక్కడే షార్ట్ ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న బాబర్ ఆజాం అద్భుత డైవ్‌తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో స్టార్క్‌తో పాటు మైదానంలోని ఆటగాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 462 పరుగుల భారీ లక్ష్యంతో 136/3తో చివరి రోజైన గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా విజయానికి 326 పరుగులు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగియాలంటే ఆసీస్ రోజంతా ఆడాలి. ఈ పరిస్థితుల్లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఖాజా, హెడ్ లంచ్ విరామం వరకు వికెట్ కాపాడుకున్నారు.

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌ను
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌ను విరామం అనంతరం రెండో ఓవర్లోనే హఫీజ్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత లబ్‌షేన్ (13)ను యాషిర్ షా తన బౌలింగ్‌లో ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్ టిమ్ పైన్ అండగా ఖాజా సెంచరీ సాధించడంతో ఆసీస్ 289/5తో టీకి వెళ్లింది. ఆ తర్వాతా వీరిద్దరూ నిలకడగా ఆడుతోన్న తరుణంలో యాసిర్ షా మరోసారి విజృంభించాడు.

తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ మ్యాచ్‌ను డ్రా దిశగా
ఖాజా, స్టార్క్ (1), సిడిల్ (0)లను వరుస ఓవర్లలో వెనక్కుపంపాడు. దీంతో కంగారూలు 333/8కు పడిపోయారు. ఇంకా 12 ఓవర్ల పైగా ఆట మిగిలుంది. యాసిర్ షా జోరు చూస్తే పాక్ విజయం తథ్యమని అనుకున్నారు. కానీ, పలుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న పైన్, నాథన్ లయాన్ (34 బంతుల్లో 5 నాటౌట్) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లారు.

చరిత్ర సృష్టించిన ఉస్మాన్ ఖవాజా
దీంతో 362/8తో ఆసీస్ రోజును ముగించింది. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 524 నిమిషాల పాటు సుదీర్ఘంగా క్రీజులో కొనసాగిన బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా(141) రికార్డు సృష్టించగా... పైన్ 219 నిమిషాలు, హెడ్ 197 నిమిషాలు క్రీజులో నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications