న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విదర్భదే రంజీ ట్రోఫీ: 78 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై విజయం

The Vidarbha Team Won The Ranji Title | Oneindia Telugu
Vidarbha beat Saurashtra by 78 runs to defend Ranji Trophy title

హైదరాబాద్: రంజీ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన విదర్భ జట్టు వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను గెలుచుకుంది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌటైంది.

<strong>Australia tour of India 2019: గాయం కారణంగా మిచెల్ స్టార్క్ దూరం</strong>Australia tour of India 2019: గాయం కారణంగా మిచెల్ స్టార్క్ దూరం

విదర్భ బౌలర్లలో

విదర్భ బౌలర్లలో

విదర్భ బౌలర్లలో స్పిన్నర్‌ ఆదిత్య సర్వతే ఇటు బ్యాట్‌తో, అటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆదిత్య సర్వాటె మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు తీసి సౌరాష్ట పతనాన్నిశాసించాడు. నాలుగో రోజు సౌరాష్ట్ర టాపార్డర్‌ను దెబ్బ తీసిన ఆదిత్య.. చివరి రోజైన గురువారం మరో మూడు వికెట్లు తీశాడు.

మొత్తం 11 వికెట్లు తీసిన ఆదిత్య

మొత్తం 11 వికెట్లు తీసిన ఆదిత్య

తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆదిత్య సర్వతే... రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అతనికి తోడుగా అక్షయ్‌ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ వికెట్‌ తీశాడు. 58/5 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజైన గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్రలో విశ్వరాజ్‌ జడేజా(52) మినహా ఎవరూ రాణించకపోయారు.

69 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు

69 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు

మరో 69 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. నలుగురు మాత్రమే నాలుగు అంకెల స్కోరును దాటలేకపోయారు. స్టార్ బ్యాట్స్‌మన్ పుజారా రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమవడం సౌరాష్ట్ర ఓటిమికి కారణమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 1, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్‌గా పుజారా వెనుదిరిగాడు.

78 పరుగులతో విదర్భ విజయం

78 పరుగులతో విదర్భ విజయం

అంతకుముందు విదర్భ తన రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. దీంతో విదర్భకు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఐదు పరుగుల ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసింది. ఆదిత్య సర్వతే (49), గణేశ్‌ సతీష్‌(35), మోహిత్‌ కాలే(38)లు జట్టు కష్టసమయాల్లో ఉన్నప్పుడు రాణించారు.

Story first published: Thursday, February 7, 2019, 12:51 [IST]
Other articles published on Feb 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X