Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే వరల్డ్ కప్‌కు భారత మహిళల జట్టు అర్హత

హైదరాబాద్: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు భారత మహిళల జట్టు అర్హత సాధించింది. మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయిర్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన రెండో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ నేతృత్వంలోని భారత జట్టు 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ వేదికగా జూన్‌లో జరిగే వరల్డ్‌కప్‌నకు టీమిండియా అర్హత సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మహిళా బ్యాట్స్‌మెన్లు ఫర్జానా హక్ (50), షర్మీన్ అక్తర్ (35) పరుగులతో రాణించారు.

Victorious India women qualify for ICC World Cup 2017

భారత బౌలర్లు మన్సి జోషి 3 వికెట్లు తీసుకోగా, స్పిన్నర్ దేవిక విద్య 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 157 పరుగుల లక్ష్య ఛేదనకు దిరిగిన భారత్ 33.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 158 పరుగులు చేసింది. భారత మహిళా బ్యాట్స్ మెన్లు మోనా మెష్రామ్ (78 నాటౌట్), కెప్టెన్ మిథాలీ రాజ్ (73 నాటౌట్) అర్ధసెంచరీలతో చెలరేగారు.

22 పరుగులకే ఓపెనర్ దీప్తి శర్మ (1) వికెట్ కోల్పోయినా ఈ ఇద్దరు నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు అజేయంగా 136 పరుగులు జోడించి జట్టుకు విజయాన్నందించారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా శుక్రవారం భారత-బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య మ్యాచ్‌లు జరిగాయి.

రెండు మ్యాచ్‌లో భారత్‌, దక్షిణాఫ్రికాలు ప్రత్యర్థి జట్లపై 9 వికెట్ల తేడాతో విజయం సాధింది ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండు జట్లను అభినందిస్తూ, ప్రపంచ కప్‌నకు అర్హత సాధించినట్లు ప్రకటించింది. ఆదివారం జరిగే ఆఖరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్ జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుంది.

ఇంగ్లాండ్‌లో జూన్‌ 24 నుంచి జులై 23వరకు మహిళ ప్రపంచ కప్‌ పోటీలు జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీలో తలపడతాయి.

సంక్షిప్త స్కోర్లు:
బంగ్లాదేశ్ మహిళలు: 50 ఓవర్లలో 8 వికెట్లకు 155 (ఫర్జానా 50, షర్మిన్ అక్తర్ 35, మన్సి జోషి 3/25);
భారత మహిళలు: 33.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 158 (మోనా మెష్రామ్ 78 నాటౌట్, మిథాలీ రాజ్ 73 నాటౌట్, ఖదిజా 1/37).

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+