Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అద్భుతం: స్ధానిక లీగ్ మ్యాచ్‌లో ఊహకందని ఓ రికార్డు

హైదరాబాద్: స్థానిక లీగులో విక్టోరియన్ థర్డ్ గ్రేడ్ క్రికెటర్ నిక్ గూడెన్ ఊహకందని ఓ రికార్డును నెలకొల్పాడు. యాల్లౌర్న్ నార్త్ తరపున ఆడుతున్న నిక్ గూడెన్... పది బంతుల్లో ఎనిమిది వికెట్లను తీశాడు. అయితే ఇందులో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఓ రన్నౌట్ కూడా గూడెన్ బౌలింగ్‌లో నమోదు అయ్యింది. గత డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరమైన ఈ కుడి చేతి బౌలర్ రీఎంట్రీ ఫస్ట్‌ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించటం విశేషం. అయితే, ఇదెలా జరిగిందో తనకూ అర్థం కాలేదని, తన బౌలింగ్‌లో అంత ప్రత్యేకతేమీ లేదని 'వీకెండ్ సన్ రైజ్' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

Victorian cricketer Nick Gooden creates record; picks triple hat-trick

'ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్‌ చేసి అందరం కలిసి బీర్‌ తాగాలన్నది మా వ్యూహం. నా బౌలింగ్‌ పనిచేసింది. అందులో వింతేమీ లేదు. నేను గొప్ప వేగంతో బంతులేమీ విసరను. ముందు నేను రెండు బంతులు వైడ్‌ వేశాను. అందులో ఒకటి ఆఫ్‌సైడ్‌, మరోటి లెగ్‌సైడ్‌ చాలా ఎడంగా వేశాను. అందరూ నన్ను చూసి నవ్వారు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లో అద్భుతం చేశా' అని నిక్‌ పేర్కొన్నాడు.

ఇటీవలే వెస్టర్ అగస్టా బీ గ్రేడ్‌కు చెందిన జోష్‌ డన్‌స్టాన్‌ అనే ఆటగాడు 40 సిక్సర్లతో 307 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జట్టు మొత్తం స్కోరు 354 కాగా, అందులో డన్ స్టాన్ స్కోరు 307. అంటే జట్టు మొత్తం స్కోరులో 86.72 శాతం పరుగులు డన్‌స్టానే సాధించాడు. అంతకముందు ఈ రికార్డు వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ పేరిట ఉంది.

1984లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిచర్డ్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 272 పరుగులు చేయగా, అందులో వివ్ రిచర్డ్స్ 189 పరుగులు చేశాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో వివ్ రిచర్డ్స్ 69.48 శాతం పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+