ఐపీఎల్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించేందుకు డిజిటల్ ప్రసారాల్లో వయాకామ్ విప్లవం.. వాటే ఫీచర్స్..!

వచ్చే ఐపీఎల్ మ్యాచ్‌లకు మీడియా రైట్స్ వేలం భారీ స్థాయిలో పలికిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో బీసీసీఐపై వేల కోట్ల వర్షం కురిసింది. వచ్చే ఐదేళ్లకు (2023-27) సంబంధించిన ఐపీఎల్ ప్రసార హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ ఖజానాలోకి రూ.48,390.52 కోట్ల భారీ మొత్తం చేరింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకూ టీవీ ప్రసార హక్కుల కోసం బీసీసీఐకి రూ.23,575 కోట్లు చెల్లించేందుకు స్టార్ నెట్‌వర్క్ సిద్ధమైంది. అయితే డిజిటల్ రైట్స్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773కోట్లు వెచ్చించి పొందింది. ఆ సంస్థకు చెందిన వయాకామ్ ద్వారా భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. అలాగే టైమ్స్ నెట్‌వర్క్ కూడా డిజిటల్ హక్కుల్లో భాగం దక్కించుకుంది.
ఏకంగా రూ.48,390కోట్లకు మీడియా రైట్స్
ఇకపోతే 2008లో ఐపీఎల్ ప్రారంభమవ్వగా.. అప్పుడు 9 ఏళ్ల ప్రసార హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ 8,200కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. సోనీ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసింది. తర్వాత 2018-22 ఐదేళ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ రూ.16,348 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈసారి ప్రసార హక్కులను నాలుగు విభాగాలుగా చేసి వేలం వేయడంతో బీసీసీఐ మూడు రెట్లు అధికంగా ఆర్జించింది. ఏకంగా రూ.48,390కోట్లు కొల్లగొట్టింది.
కొత్త యాప్ తీసుకురాబోతున్న వయాకమ్
ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ని దక్కించుకున్న వయాకామ్ 18కి చెందిన వూట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారం కానుందని ప్రచారం జరిగింది. అయితే ఐపీఎల్ ప్రసారాల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకువచ్చేందుకు వయాకామ్ ప్లాన్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ స్థాయిలో ఓటీటీ తరహాలో ఈ యాప్‌ను తీసుకువచ్చేలా మేనేజ్ మెంట్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. అయితే జియో టీవీ సేవలను ఉచితంగా అందిస్తున్న రిలయన్స్ నెట్‌వర్క్, కొత్తగా తీసుకురాబోయే ఓటీటీ యాప్‌కి మాత్రం భారీగా ఛార్జ్ చేయొచ్చు.
అదిరిపోయే ఫీచర్స్ ఇవే..
ఇకపోతే డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకామ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు సిద్ధమైంది. మ్యాచ్ వీక్షణలో కొత్త తరహా పంథాను నెలకొల్పనుంది. కొన్ని ప్రత్యేక స్పెషలిటీస్ ఉన్నాయి.
1. స్టేడియంలో ఉండి చూసిన ఫీలింగ్ తెచ్చేలా మల్టీపుల్ కెమెరా యాంగిల్స్ ద్వారా మ్యాచ్ చూసే అవకాశాన్ని వ్యూయర్స్‌కు కల్పించనుంది.
2. వ్యూయర్స్ తాము ఏ కెమెరా యాంగిల్లో మ్యాచ్ చూడాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకునే వీలుంటుంది. అంటే బౌలింగ్ ఎండ్ నుంచా.. బ్యాటింగ్ వెనకాల నుంచా.. లేక సైడ్ యాంగిల్లో చూడాలనుకుంటున్నారా ఇక ప్రేక్షకుల ఇష్టం.
3. వాచ్ పార్టీ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకురాబోతుంది. అంటే మ్యాచ్‌ను వర్చువల్‌గా ఫ్రెండ్స్ కలిసి చూడొచ్చు. గూగుల్ మీట్ తరహాలో పెద్ద స్క్రీన్‌పై మ్యాచ్ ప్రసారం అవుతుంది. ఫ్రెండ్స్ స్మాల్ బాక్స్‌లలో కన్పిస్తారు. ఫ్రెండ్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ చూసే వీలు కలగనుంది.
4. ఇకపోతే ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా 4కే అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో మ్యాచ్ ప్రసారాలు చేయనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications