For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఫేసర్

 Veteran Indian pacer Praveen Kumar announces retirement from all forms of cricket

న్యూ ఢిల్లీ: భారత జట్టుకు 11 ఏళ్ల పాటు ప్రాతినిధ్య వహించిన వెటరన్ పేసర్ ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2007లో నాగ్‌పూర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. 2012 మార్చి 30న చివరిసారిగా దక్షిణాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. ఈ 11 ఏళ్లలో భారత్ తరఫున 68 వన్డేలు, ఆరు టెస్టులు ఆడాడు.

వన్డేల్లో 77 వికెట్లు తీసిన ప్రవీణ్ టెస్టుల్లో 27 వికెట్లు కూల్చాడు. టెస్టుల్లో ప్రవీణ్ తీసిన వికెట్లలో లార్డ్స్‌లో ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఆ సిరీస్‌లో ప్రవీణ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. తిరిగి భారత్ తరఫున టెస్టులు ఆడలేదు. 2011 వరల్డ్ కప్‌లో ఆడిన భారత జట్టుకు కూడా ప్రవీణ్ ఎంపికయ్యాడు.

కానీ గాయం కారణంగా ప్రపంచ కప్ ఆడే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. 2011లో లార్డ్స్ టెస్టులో 106 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో హానర్స్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్న 18వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ప్రవీణ్.. ఉత్తర ప్రదేశ్ తరఫున రాణించాడు.

2005-06 రంజీ సీజన్లో 41 వికెట్లు తీయడంతోపాటు 386 పరుగులు సాధించాడు. +999'ఉత్తరప్రదేశ్ తరఫున క్రికెట్ ఆడితే యువ ఆటగాళ్ల అవకాశాలు దెబ్బతింటాయి. అందుకే దేశవాళీ క్రికెట్ కూడా ఆడన'ని ప్రవీణ్ కుమార్ తెలిపాడు. కానీ ఓఎన్జీసీ తరఫున మాత్రం క్రికెట్ ఆడతానని చెప్పాడు.

Story first published: Saturday, October 20, 2018, 13:58 [IST]
Other articles published on Oct 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+