న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తన ఫేవరేట్ హీరోయిన్‌ని కలిసిన హర్భజన్ సింగ్

Veteran Harbhajan Singh Reveals his Favourite Actress

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ బాలీవుడ్‌ నటి కాజోల్‌ను కలిశారు. బాలీవుడ్‌ నటీమణుల్లో తనకు కాజోల్‌ అంటే ఎంతో ఇష్టమని భజ్జీ ఈ సందర్భంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. "నేను సిమ్రన్‌ను కలిసిన వేళ. నాకెంతో ఇష్టమైన నటి. మీరు నటించిన 'హెలికాప్టర్‌ ఈలా' సినిమాకు గానూ ఆల్‌ ది బెస్ట్‌" అని ట్వీట్‌ చేశాడు.

అర్థం చేసుకోలేకపోతున్నా: జట్టు ఎంపికపై ప్రశ్నల వర్షం కురిపించిన భజ్జీఅర్థం చేసుకోలేకపోతున్నా: జట్టు ఎంపికపై ప్రశ్నల వర్షం కురిపించిన భజ్జీ

అదే సమయంలో కాజోల్‌తో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో భజ్జీ పంచుకున్నాడు. అయితే తాను కాజోల్‌ను ఎక్కడ కలిశారో మాత్రం భజ్జీ తన ట్వీట్‍‌లో వెల్లడించలేదు. కాజోల్‌ నటించిన చిత్రాల్లో "దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే" చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తారు.

ఈ సినిమాలో కాజోల్‌ పాత్ర పేరు సిమ్రన్‌. ఆ పేరును ఉద్దేశిస్తూ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాఢు. కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'హెలికాప్టర్ ఈలా' అనే సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆమె ఈలా అనే తల్లి పాత్రలో నటించారు. ప్రదీప్‌ సర్కార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇక, హార్భజన్ సింగ్ విషయానికి వస్తే ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో కామెంటేటర్‌గా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకు సెలక్టర్లు చోటు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు చేశాడు.

జట్టు ఎంపిక విషయంలో హర్భజన్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ "జట్టు ఎంపిక ప్రక్రియ ఓ రహస్యంలా కనపడుతోంది. మూడు నెలలుగా ఓ ఆటగాడిని బెంచికే ఎలా పరిమితం చేస్తారు? అతడు జట్టులో ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు" అని భజ్జీ వ్యాఖ్యానించాడు.

"భారత జట్టుని ఎంపిక చేసే ప్రక్రియలో ఒక్కో ఆటగాడికి ఒక్కో నిబంధన వర్తిస్తుందన్నట్లు పరిస్థితులు కనపడుతున్నాయి. విజయాలు సాధించేందుకు కొందరికే అవకాశాలను మెండుగా ఇస్తున్నారు. మరికొందరికి అస్సలు అవకాశాలు రావట్లేదు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు" అని అన్నాడు.

Story first published: Tuesday, October 9, 2018, 18:51 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X