Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా స్కెచ్‌కి కోహ్లీ దొరికిపోయాడు: ఫిలాండర్

Vernon Philander reveals how he planned Virat Kohli, R Ashwin dismissals

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలిటెస్టు పరాజయానికి విశ్లేషణలు వెల్లువలా వస్తున్నాయి. దానికి తగ్గట్టే బాగా రాణించిన వారికి ప్రశంసలు అలానే వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ ఎలా చేశానో తెలుసా అంటూ గొప్పలు చెప్పుకుంటూ బయలుదేరాడు. ఫిలాండర్

కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలిటెస్ట్ గురించి ఇలా..
పక్కా ప్రణాళికతోనే విరాట్‌ కోహ్లిని నియంత్రించామని దక్షిణాఫ్రికా పేసర్‌ ఫిలాండర్‌ చెప్పాడు. కేప్‌టౌన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ వికెట్‌ను ఫిలాండర్‌ తీసిన సంగతి తెలిసిందే. 'విరాట్‌ గొప్ప ఆటగాడు. దూకుడుగా ఆడతాడు. అతని దూకుడుకు కళ్లెం వేసి, వీలైనంత వరకు అతడిని నిశ్శబ్దంగా ఉంచాలనేది మా ప్రణాళిక. ఆ బాధ్యతను నేను తీసుకున్నా. అతణ్ని ఆపడానికి ప్రయత్నించా.' అని పేర్కొన్నాడు.

ఇలా అవుట్ చేశాడట:
'సుమారు రెండున్నర ఓవర్ల పాటు వికెట్‌కు దూరంగా బంతి వేసి కోహ్లి సహనాన్ని పరీక్షించాను. తర్వాత అతని కాళ్లకు బంతి సంధించా. ఇది కచ్చితంగా అతణ్ని అడ్డుకోవడానికి పన్నిన వ్యూహం. అతను వికెట్ల ముందు ఆడేలా చేసి వికెట్‌ సాధించా. అతను సమీక్ష కోరినప్పుడు నేను ఆందోళన చెందలేదు. ఎందుకంటే నాకు తెలుసు అది ఔట్‌ అని. నేను నమ్మకంతో ఉన్నా. ఔటైనా తర్వాత కోహ్లిని నేనేం అన్లేదు. కోహ్లి వికెట్‌ ఎంత విలువైందో మాకు తెలుసు. వికెట్‌ తీయగానే సంబరాలు చేసుకున్నాం'అని ఫిలాండర్‌ తెలిపాడు.

ఈ వికెట్‌ తీయడం వెనక కెప్టెన్‌ డుప్లెసిస్‌ ప్రణాళిక దాగి ఉందని ఫిలాండర్‌ తెలిపాడు. ఇదే రీతిలో అశ్విన్‌ను కూడా వికెట్లకు దూరంగా బంతులు వేసి అవుట్ చేశానని వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 9:06 [IST]
Other articles published on Jan 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+