Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను అప్లై చేసింది ప్రధాన కోచ్ పదవికి కాదు: వెంకటేష్ ప్రసాద్

హైదరాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు గురువారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాను ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయలేదని వెంకటేష్ ప్రసాద్ తేల్చిచెప్పాడు.

ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా వెంకటేష్ ప్రసాద్ కూడా దరఖాస్తు చేసినట్లు వార్తలు వచ్చాయి.

అసిస్టెంట్ కోచ్ లేగా బౌలింగ్‌ కోచ్‌గా

అసిస్టెంట్ కోచ్ లేగా బౌలింగ్‌ కోచ్‌గా

అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వాస్తవమే కానీ, అసిస్టెంట్ కోచ్ లేగా బౌలింగ్‌ కోచ్‌గా పని చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పాడు. రవిశాస్త్రి లేదా సెహ్వాగ్‌లలో ఎవరు కోచ్‌ అయినా.. వారి ఆధ్వర్యంలో పని చేసేందుకు తాను సిద్ధమని తెలిపాడు.

ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేయలేదు

ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేయలేదు

'ప్రధాన కోచ్‌ పదవికి నేను దరఖాస్తు చేసుకోలేదు. అసిస్టెంట్ కోచ్‌గా భారత క్రికెట్‌కు సేవలదించాలనుకుంటున్నా. రవిశాస్త్రి, సెహ్వాగ్‌లలో ఎవరు ప్రధాన కోచైనా నాకు ఇబ్బంది లేదు. ఎవరి ఆధ్వర్యంలోనైనా కలిసి పని చేస్తా. అంతర్జాతీయ క్రికెటర్‌గా, మాజీ కోచ్‌గా జట్టు కోసం నా అనుభవాన్ని ఉపయోగిస్తా' అని ప్రసాద్‌ చెప్పాడు.

జూనియర్ జట్టుకు నేషనల్ చీఫ్ సెలక్టర్‌గా

జూనియర్ జట్టుకు నేషనల్ చీఫ్ సెలక్టర్‌గా

ఇదిలా ఉంటే ప్రధాన కోచ్‌కు తనకు ఇష్టమైన అసిస్టెంట్ కోచ్‌లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఇప్పటికే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డ గణేష్‌లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం జూనియర్ జట్టుకు నేషనల్ చీఫ్ సెలక్టర్‌గా పనిచేస్తున్నారు.

భారత్ తరఫున 33 టెస్టులు, 162 వన్డేలు

భారత్ తరఫున 33 టెస్టులు, 162 వన్డేలు

అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తన మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. వెంకటేష్ ప్రసాద్ భారత్ తరఫున 33 టెస్టులు, 162 వన్డేలు ఆడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+