Venkatesh Iyer: టీమిండియాలో నయా ఆల్‌రౌండర్ ప్లేస్ సుస్థిరం.. హార్దిక్ పాండ్యా కథ ఇక ముగిసినట్టే!

గాయం కారణంగా కొంత కాలంగా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ కూడా చేయలేకపోవడంతో సెలెక్టర్లు కూడా అతడిని పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భారత జట్టులోకి దూసుకొచ్చాడు. జట్టులో చోటు సంపాదించుకోవడమే కాకుండా తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. బాల్, బ్యాటుతో రాణిస్తున్నాడు.

వెంకటేశ్ అదుర్స్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సమయంలో యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం కావడంతో వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వెంకటేశ్ తాజాగా జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ ప్రస్తుతం అదరగొడుతున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మిడిలార్డర్‌లో కీలక సమయంలో విలువైన పరుగులు చేస్తున్నాడు. దీనికి సాక్ష్యమే ఇటీవల విండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్ అని చెప్పుకోవాలి.

ఫినిషర్‌గా పేరు
అదే సమయంలో టీమిండియాకు ఫినిషర్ లోటును వెంకటేశ్ అయ్యర్ తీర్చుతున్నాడని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కీలక సమయంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన అయ్యర్ 92 పరుగులతో అదరగొట్టాడు. వేగంగా పరుగులు రాబట్టాడు. అవరసమైనప్పుడు బంతితోనూ రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో హార్దిక్ పాండ్యా చోటు భర్తీ చేయగల ఆటగాడు వెంకటేశ్ అయ్యరేనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జట్టులో వెంకటేశ్ అయ్యర్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని చెప్పుకోవాలి.

ప్రపంచకప్ జట్టులో చోటు
క్రికెట్ విశ్లషకులు వసీం జాఫర్ కూడా వెంకటేశ్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అంటూ కొనియాడాడు. ప్రస్తుతం ఉన్న ఫాం దృష్యా హార్దిక్ పాండ్యా కంటే వెంకటేశ్ అయ్యరే రానున్న ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి ఒక అడుగు ముందుంటాడని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడో లేదో చెప్పలేమని, ఏది ఏమైనా టీమిండియాలో హార్దిక్ పాండ్యా మళ్లీ చోటు దక్కించుకోవాలంటే రానున్న ఐపీఎల్ 2022 అతనికి చాలా కీలమని జాఫర్ అన్నాడు.

వారి నుంచి కూడా పాండ్యాకు పోటీ
హార్దిక్ పాండ్యాకు ఒక్క వెంకటేశ్ అయ్యర్ నుంచే కాకుండా దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంది. చాహర్, ఠాకూర్ కూడా ఇటీవల కాలంలో జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్‌తో, బంతితో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రస్తుతం వీరు టీమిండియాలో తమ పేరును సుస్థిరం చేసుకున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి తిరిగి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరైతే టీమిండియాలో ఇక హార్దిక్ పాండ్యా కథ ముగిసినట్టేనని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా.. గతంలో అనేక మ్యాచ్‌ల్లో బ్యాట్, బాల్‌తో రాణించి టీమిండియాను గెలిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications