
ఐపీఎల్ 2022 మహిళల టీ20 ఛాలెంజ్‌లో మూడోది, మరియు చివరిదైన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వెలాసిటీ వర్సెస్ ట్రైల్‌బ్లేజర్స్ మధ్య జరుగుతుంది. అయితే దీప్తి శర్మ కెప్టెన్సీ వహిస్తున్న వెలాసిటీ ఆడిన ఒక మ్యాచ్ గెలిచి ఫైనల్ రేసులో ఉంది. మంచి నెట్ రన్ రేట్ కూడా ఉంది. వెలాసిటీ మొదటి మ్యాచ్‌లో సూపర్‌నోవాస్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పోతే స్మృతి మంధాన కెప్టెన్సీలో బరిలో ఉన్న ట్రైల్ బ్లేజర్స్ ఆడిన తొలి మ్యాచ్ లో సూపర్ నోవాస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. 49పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆ జట్టు నెగెటివ్ రన్ రేట్లో ఉంది. ఇక ట్రైల్‌బ్లేజర్స్ టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకునేలా నేటి మ్యాచ్‌లో వెలాసిటీపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు నేటి మ్యాచ్ కోసం గ్రౌండ్లోకి రాగా.. వెలాసిటీ కెప్టెన్ దీప్తి శర్మ టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకుంది. ఛేజింగ్ చేయడంలో కాస్త బెటర్ అవకాశాలుంటాయని అందుకే బౌలింగ్ ఎంచుకున్నానని దీప్తి తెలిపింది. ఇకపోతే తమ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుందని చెప్పింది. ఇక టాస్ ఓడిన స్మృతి మంధాన మాట్లాడుతూ.. మాకింకా అవకాశాలున్నాయి. భారీ తేడాతో గెలిచేలా మేం ప్లాన్ చేసుకున్నాం. ఏదేమైనా భారీ టార్గెట్ ఇచ్చేలా ఆడాలని ఫిక్సయ్యాం అని పేర్కొంది.
తుది జట్లు
ట్రైల్‌బ్లేజర్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (సి), హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, సోఫియా డంక్లీ, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (w), అరుంధతి రెడ్డి, సల్మా ఖాతున్, పూనమ్ యాదవ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్
వెలాసిటీ (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, నత్తకాన్ చంతమ్, యాస్తిక భాటియా(w), లారా వోల్వార్డ్ట్, దీప్తి శర్మ(సి), కిరణ్ నవ్‌గిరే, స్నేహ రాణా, రాధా యాదవ్, కేట్ క్రాస్, అయాబొంగా ఖాకా, సిమ్రాన్ బహదూర్