Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు పాక్ ‘మౌకా’: వీణా మాలిక్‌పై భారత ఫ్యాన్స్ ఫైర్

ఇస్లామాబాద్: ఏ దేశ అభిమానులైనా తమ జట్టు గెలిస్తే ఆనంద పడతారు.. ఓడిపోతే బాధ పడతారు. కానీ.. ప్రపంచంలో రెండు దేశాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అవే పాకిస్థాన్, బంగ్లాదేశ్. టీమిండియా చేతిలో ఓటమిపాలైన ఆ రెండు దేశాలు ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలవడంతో భారత అభిమానులందరూ ఆవేదనతో ఉండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తుండటం విచారకరం. ఆ దేశాలు ఏ దేశం చేతిలోనైనా ఓడినా, గెలిచినా భారతీయులు అంతగా పట్టించుకోరు. అయితే, ఇందుకు ఈ రెండు దేశాల క్రికెటర్లు, అభిమానుల ప్రవర్తన భిన్నం. భారత్ ఓడితే వాళ్లకెందుకో సంతోషం.

ఇప్పటికే, ఏకంగా బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ విండీస్ చేతిలో భారత్ ఓడిపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాను విండీస్ అభిమానినంటూ భారత్ ఓటమిపై ఆనందంతో వెకిలి నవ్వులు నవ్వుతున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో భారత అభిమానులు అతనిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో తన ట్వీట్ డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించి.. సారీ చెప్పాడు ఆ బంగ్లా కెప్టెన్.

Veena Malik

తాజాగా, పాకిస్థాన్‌కు చెందని నటి వీణా మాలిక్ కూడా టీమిండియాపై విమర్శపూర్వక ట్వీట్లు చేసింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి పేరుతెచ్చుకున్న ఆ నాటి ఇప్పుడు టీమిండియాపై విమర్శలు ఎక్కు పెట్టడంపై భారత అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

'ఎంత అద్భుతమైన మ్యాచ్..వెస్టిండీస్‌ మీరు సాధించారు. డియర్ ఇండియా, పాకిస్తాన్ నుంచి మీకో మెసేజ్ ...'మౌకా మౌకా'' అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. బాలీవుడ్‌లో మౌకా(అవకాశాలు) రాకపోవడంతో ఈ పాకిస్థానీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని మండిపడ్డారు.

అయితే వరల్డ్‌ కప్‌లో భారత్‌పై ఎలాగూ గెలిచే సత్తా పాకిస్తాన్‌కు లేకపోవడంతోనే.. కనీసం ఇలాగైనా సంతోష పడుతున్నారంటూ నెటిజన్లు సదరు నటిపై సెటైర్లు వేస్తున్నారు. ఈ పాకిస్థాన్ నటి తన ట్వీట్‌కు క్షమాపణ చెబుతుందో లేదో చూడాలి మరి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+