
మూడో ఎడిషన్‌లో హోబార్ట్ హరికేన్స్
ఇప్పటికే ఈ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్, బ్రిస్బేన్ హీట్ తరఫున స్మృతి మందాన ఆడిన సంగతి తెలిసిందే. బీబీఎల్ మహిళల మూడో ఎడిషన్‌లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడేందుకు వేద కృష్ణమూర్తి ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వేద కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడింది.

చాలా ఆనందంగా ఉందన్న వేద
'బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. నెలరోజుల క్రితమే హరికేన్స్ యాజమాన్యం నన్ను సంప్రదించారు. వెంటనే దీని గురించి హర్మన్, స్మృతితో చర్చించా. కాకపోతే అప్పటికి దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ఖరారు కాలేదు. దీంతో వారికి ఏమీ చెప్పలేకపోయా' అని ఆమె వెల్లడించింది.

మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండటం కుదరదు
'బీసీసీఐ ఫిబ్రవరిలో మా దక్షిణాఫ్రికా పర్యటన గురించి షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో నాకు మార్గం సుగమమైంది. వెంటనే హరికేన్స్ నిర్వాహకులతో మాట్లాడాను. మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండటం కుదరదని, 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడతా.ఈ విషయాన్ని వారితో చెప్పా. దీనికి వారు సరే అన్నారు' అని వేద పేర్కొన్నారు.

దీప్తి శర్మతో కూడా బీబీఎల్ ఫ్రాంఛైజీలు చర్చలు
ఇదిలా ఉంటే 2017 డిసెంబరు 9 నుంచి 2018 ఫిబ్రవరి 4 వరకు బిగ్ బాష్ లీగ్ మూడో ఎడిషన్ లీగ్ జరగనుంది. మరో ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో కూడా బిగ్ బాష్ లీగ్ ఫ్రాంఛైజీ జట్లు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











