56 బంతుల్లో సెంచరీ: 28 ఏళ్ల వరకూ చెక్కు చెదరని రికార్డు

హైదరాబాద్: 'VB Bro' హాట్ స్టార్‌ను వీక్షించే తమిళ క్రికెట్ అభిమానులకు బాగా పరిచయం ఉన్న పేరు. ఆయన పూర్తి పేరు వక్కడై బిక్షేశ్వరన్ చంద్రశేఖర్. తమిళనాడు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన చంద్రశేఖర్ గత గురువారం చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

PKL 2019: యు ముంబా విజయాలకు హర్యానా స్టీలెర్స్ బ్రేకులు వేసేనా?

ఆర్థిక లావాదేవీలే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని చెన్నై పోలీసులు వెల్లడించారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో వీబీ కంచి వీరన్స్‌ జట్టుకు వీబీ చంద్రశేఖర్‌ యజమానిగా ఉన్నారు. ఈ జట్టుపై ఆయన సుమారు మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆర్ధికంగా చితికిపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

విషాదపు ముగింపు

విషాదపు ముగింపు

టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ అయిన వీబీ చంద్రశేఖర్ తన జీవితానికి విషాదపు ముగింపు పలికినప్పటికీ... క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా అందరికీ ఎప్పటికీ గుర్తిండిపోతాడు. వీబీ చంద్రశేఖర్‌ టీమిండియా తరఫున 1988-90 మధ్య కాలంలో ఏడు వన్డేలు ఆడాడు. 1988లో రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన ఇరానీకప్‌ మ్యాచ్‌లో చంద్రశేఖర్‌ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఆర్చర్ మామూలోడు కాదు, అదొక భయంకరమైన క్షణమన్న రూట్

అత్యంత వేగవంతమైన సెంచరీ

అత్యంత వేగవంతమైన సెంచరీ

అప్పట్లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. దాదాపు 28 ఏళ్ల వరకూ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. అయితే, 2016లో రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరుపున రిషబ్‌ పంత్‌ 48 బంతుల్లో సెంచరీ సాధించి చంద్రశేఖర్‌ పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. తాజాగా, చంద్రశేఖర్‌కు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

ఉన్నత చదువుల కోసమని అమెరికాకు

ఉన్నత చదువుల కోసమని అమెరికాకు

మ్యాథమ్యాటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ అనంతరం కొయంబత్తూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఆయనకు క్రికెట్‌పై ఇష్టం పెరిగింది. ఇంజనీరింగ్ చదివేరోజుల్లో ఫస్ట్ డివిజన్ క్రికెట్ ఆడేందుకు తిరిగి చెన్నైకి వచ్చేవాడు. అదే సమయంలో చంద్రశేఖర్‌ను అమెరికాలో ఉన్నత చదువుల కోసమని ఆయన తండ్రి విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నారట.

ఒక ఏడాది గడువు ఇవ్వాల్సిందిగా

ఒక ఏడాది గడువు ఇవ్వాల్సిందిగా

అయితే, క్రికెట్‌లో తనని తాను నిరూపించుకోవడానికి ఒక ఏడాది గడువు ఇవ్వాల్సిందిగా తన తండ్రిని కోరినట్లు చంద్రశేఖర్‌ ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు. "చెప్పినట్టే సరిగ్గా సంవత్సరం తర్వాత రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాను. మరో సంవత్సరం అవకాశం ఇస్తే టీమిండియాకు ఆడతానని మళ్లీ అడిగాను. అక్కడ కూడా వెంటనే సక్సెస్ అయ్యాను" అని 2016లో క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

కలలో కూడా ఊహించలేదు: 11 ఏళ్ల క్రికెట్ కెరీర్‌పై కోహ్లీ భావోద్వేగ ట్వీట్

తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్

తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్

1986లో తమిళనాడు తరుపున తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే సమయానికి ఆయన వయసు 25 ఏళ్లు. ఈ వయసులో క్రికెట్‌లోకి అడుగుపెట్టడంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత వీబీ చంద్రశేఖర్‌ కేవలం ఏడు వన్డేలు ఆడాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత గ్రెగ్‌ ఛాపెల్‌ కోచ్‌గా ఉన్న సమయంలో సెలక్టర్‌గా పనిచేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 19, 2019, 17:09 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X