Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR VS RCB: కోహ్లీకి సవాల్ విసిరిన వరుణ్ చక్రవర్తి!

IPL 2025 KKR VS RCB: కోల్‌కతా నైట్ రైడర్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ 2025 సీజన్‌ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కేకేఆర్‌ మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి పైనే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే కోహ్లీపై వరుణ్ చక్రవర్తి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ కోసం తాను హోం వర్క్ పూర్తి చేసినట్లు తెలిపాడు.

ఇప్పటికే అది పూర్తి చేశా..
"విరాట్ కోహ్లీపై ఆడటం కచ్చితంగా ఎక్సైటింగ్ గానే ఉంటుంది. సవాల్ గా ఉంటుంది. అతడు నా బౌలింగ్ లో అద్భుతంగా ఆడాడు. అలానే నేను కూడా మంచి ప్రదర్శనే చేశాను. ఏ స్థాయి క్రికెట్ అయినా ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయకూడదు. ఐపీఎల్ లోనూ ప్రతీ టీమ్ అంతే. ఒక దాని మించి ఇంకొకటి ఉంటుంది. ఆర్సీబీకి మంచి నాణ్యమైన జట్టు ఉంటుంది. అయినప్పటికీ ఆ జట్టును ఎదుర్కొనేందుకు చేయాల్సిన హోం వర్క్ పూర్తి చేశాం. నేను కూడా నా వ్యూహాలను రచించాను. హోం వర్క్ ను పూర్తి చేశాను. గత సీజన్‌లో ఎలా ఆడానో.. ఇప్పుడు కూడా అలానే ఆడుతాను. కాకపోతే కాస్త కొత్తగా ప్రయత్నిస్తాను. పరిస్థితికి తగ్గట్టుగా బౌలింగ్‌ చేస్తుంటాను. " అని చెప్పుకొచ్చాడు.

Varun Chakravarthy excited for bowling Virat Kohli in IPL 2025 KKR VS RCB

కాగా, వరుణ్ బౌలింగ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 40 పరుగులు చేశాడు. అతడి బౌలింగ్‌లో విరాట్ ఒకసారి మాత్రమే ఔట్ అయ్యాడు. ఇకపోతే ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.

Story first published: Saturday, March 22, 2025, 13:32 [IST]
Other articles published on Mar 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+