కోర్టులో ప్రియురాలితో క్రికెటర్ వరుణ్ ఆరోన్ పెళ్లి
జంషెడ్‌పూర్: భారత పేసర్ వరుణ్ ఆరోన్ కోర్టు ఆవరణలో పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఉన్నట్లుండి తన చిన్ననాటి స్నేహితురాలు రాగిణి సింగ్‌ను కోర్టులో వివాహం చేసుకున్నాడు.
సోమవారం జంషెడ్‌పూర్‌లోని కోర్టులో వివాహం కోసం దరఖాస్తు చేసుకుని ఈ జంట చట్టబద్ధంగా ఒక్కటైంది. ఫిబ్రవరి 4న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వరుణ్, రాగిణి వివాహం చేసుకోనున్నారు.

లయోల పాఠశాలలో చదువుకున్న సమయంలోనే స్నేహితులైన వీరిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వివాహబంధంతో ఒక్కటయ్యారు.
వివాహ సంబరాల నేపథ్యంలో ఫిబ్రవరి -3-7వరకు జరిగే రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ఆడాల్సిన వరుణ్ ఆరోన్ దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం వరుణ్ ఆరోన్ జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కాగా, ఇటీవల భారత ఆటగాళ్లు హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ తమ తమ ప్రియురాళ్లను వివాహమాడిన విషయం తెలిసిందే. గత నవంబర్‌లో యువరాజ్ సింగ్ కూడా తన ప్రియురాలు హజెల్ కీచ్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. ఫిబ్రవరిలోనే వీరిద్దరి వివాహం జరిగే అవకాశాలున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications