వాలెంటైన్స్ డే స్పెషల్.. సచిన్ 'ఫస్ట్ లవ్' ఏంటంటే (వీడియో)?

ముంబై: ఈ సృష్టిలో ఎంతో విలువైంది ఒక్క ప్రేమ మాత్రమే. ఇది అక్షర సత్యం. ప్రేమను మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. అయితే ఈ ప్రేమ పలు రకాలుగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ప్రేమకు అర్థం మారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14. నేడే ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే). ప్రేమికులకు వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైంది. ప్రేమికుల రోజును ప్రేమికులందరూ నెమరువేసుకుంటారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన 'ఫస్ట్ లవ్'ను గుర్తుచేసుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసారు.
మై ఫస్ట్ లవ్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ శుక్రవారం తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశారు. సచిన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీడియోకి 'మై ఫస్ట్ లవ్' అనే కాప్షన్ ఇచ్చారు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న విషయాన్ని సచిన్ చెప్పకనే చెప్పారు. ఇప్పటికీ సచిన్ క్రికెట్ ఆటను ఎంతగా ఇష్టపడుతున్నాడో వీడియో ద్వారా చెప్పారు. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన సచిన్.. అక్కడ మళ్లీ బ్యాట్ పట్టారు. ఆ సమయంలో తీసిన వీడియోను షేర్ చేశారు.

ప్రేమ వివాహం
సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1995లో అంజలిని సచిన్ వివాహం చేసుకున్నారు. అంజలి, సచిన్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. 46 ఏళ్ల సచిన్ టెండూల్కర్ 2013లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. సచిన్ భారత్ తరపున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడారు. వన్డేలలో 44.86 సగటుతో 18426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 91 అర్థ సెంచరీలు ఉన్నాయి.

మళ్లీ బ్యాట్ పట్టిన సచిన్
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తలపెట్టిన 'బుష్‌ఫైర్ క్రికెట్ బాష్' చారిటీ మ్యాచ్ గత ఆదివారం జరిగింది. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ లెవెన్‌కు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ మ్యాచులో పాంటింగ్ జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. చారిటీ మ్యాచ్ కోసం సచిన్ మళ్లీ బ్యాట్ పట్టారు. మ్యాచ్ బ్రేక్ సమయంలో క్రికెట్ ఆడి అందరిని అలరించారు.

గంగూలీ సరదాగా కామెంట్
బుష్‌ఫైర్ చారిటీ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సచిన్ ఉద్దేశించి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సరదాగా కామెంట్ చేశారు. సచిన్ అక్కడి ఫొటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయగా.. వాటిపై దాదా 'కొంత మంది నిజంగా అదృష్టవంతులు.. హాలీడేస్‌ను హాయిగా గడుపుతారు' అని తన బీసీసీఐ బాధ్యతలను ఉద్దేశించి ఫన్నీగా కామెంట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications