Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం దంచుడు నాయనా: బుడ్డోడిపై ఐఐఎం ఇండోర్ పరిశోధన!

ఐపీఎల్ 2026 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ లోకాన్ని ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రీసెర్చ్ వస్తువుగా మారారు. వైభవ్ అసాధారణ ప్రతిభ, ఆటతీరుపై దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ సంస్థ అయిన ఐఐటీ ఇండోర్ ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇంత చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌డమ్, అపరిమితమైన ప్రజాదరణ, పెరుగుతున్న అంచనాలు ఓ యువ ఆటగాడి మానసిక, సామాజిక, వృత్తిపరమైన ఎదుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయనే కోణంలో ఈ రీసెర్చ్ సాగనుంది. రాబోయే 3 నెలల పాటు సాగే ఈ పరిశోధన నివేదికను ఐఐఎం ఇండోర్ బీసీసీఐతో కూడా పంచుకోనుంది.

ఐఐఎం ఇండోర్ డైరెక్టర్ హిమాన్షు రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ అధ్యయనం కేవలం వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డులను విశ్లేషించడానికి మాత్రమే పరిమితం కాదు. ఓ అద్భుతమైన బాల మేధావి లేదా బాల ప్రతిభావంతుడు ఇంతటి శిఖరాలను అధిరోహించడానికి వెనుక ఉన్న అసలు కారణాలను, విభిన్న కారకాలను అర్థం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. వైభవ్ సూర్యవంశీ వ్యక్తిత్వం, ప్రవర్తన, ప్రాక్టీస్, కుటుంబం అందించిన సహకారం, కోచింగ్ విధానం, చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం ఈ విజయగాథలో ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకోనున్నారు.

Vaibhav Suryavanshi Why IIM Indore Is Researching This 15-Year-Old IPL Star Full Details

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే 237.30 అనే నమ్మశక్యం కాని స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి టోర్నమెంట్‌లోనే అతిపెద్ద స్టార్‌గా అవతరించాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు ఉన్నాయి. దీనితో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అయితే ఐఐఎం ఇండోర్ ఈ రికార్డులతో పాటు చిన్న వయసులో వచ్చే కీర్తి, సోషల్ మీడియా ఒత్తిళ్లు, విపరీతమైన అంచనాలు, ఆర్థిక మార్పులు యువ ప్రతిభావంతుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్లేయర్లపై ఉండే ఒత్తిడి మిగిలిన రంగాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబాడ, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని వైభవ్ సూర్యవంశీ చూపిన తెగింపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకే వైభవ్ కథ కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్ తరాలకు ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని ఐఐఎం భావించింది. సైకాలజీ, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, బిహేవియరల్ సైన్స్ రంగాలకు చెందిన నిపుణులు ఈ పరిశోధనలో పాల్గొననున్నారు. వచ్చే రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఈ రీసెర్చ్.. కేవలం క్రీడలకే కాకుండా సైన్స్, ఆర్ట్స్, సంగీతం వంటి ఇతర రంగాలలో రాణించే బాల ప్రతిభావంతులకు కూడా ఎంతో సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Wednesday, June 3, 2026, 9:24 [IST]
Other articles published on Jun 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+