వైభవ్ ముందు అభిషేక్ బచ్చా: పాక్ మాజీ పేసర్
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వైభవ్ భారత జట్టులోకి వస్తే.. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను అభిమానులు మర్చిపోతారని తన్వీర్ జోస్యం చెప్పాడు. వైభవ్ ధైర్యసాహసాలు, దూకుడు చూస్తుంటే అతను అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డాడు.
అభిషేక్ కంటే వైభవే మిన్న:
తన్వీర్ అహ్మద్ తన కామెంట్లను మరింత వివరిస్తూ.. "ఒకవేళ టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ కలిసి బ్యాటింగ్ చేస్తే.. అందరి దృష్టి వైభవ్‌పైనే ఉంటుంది. అభిషేక్ కనీసం వైభవ్ దరిదాపుల్లోకి కూడా రాలేడు. ప్రజలు కేవలం వైభవ్ ఆటను మాత్రమే గమనిస్తారు, అభిషేక్ ఉనికిని కూడా పట్టించుకోరు" అని సంచలన కామెంట్స్ చేశాడు. అయితే సుదీర్ఘ కాలం పాటు వైభవ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని.. కానీ ప్రస్తుతం అతని ఆట తీరు మాత్రం అమోఘమని తన్వీర్ పేర్కొన్నాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ
కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుత సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన కేవలం 4 ఇన్నింగ్స్‌ల్లోనే 200 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 26 బంతుల్లోనే 78 పరుగులు చేసిన ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కోవడంలో వైభవ్ చూపుతున్న ఆత్మవిశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పోటీలో అభిషేక్ శర్మ
మరోవైపు అభిషేక్ శర్మ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ఇటీవల 74 పరుగులతో మెరిసిన అభిషేక్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 182 పరుగులు సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్‌తో వైభవ్‌ను పోల్చడం ఇప్పుడే సరికాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత క్రికెట్‌కు ఓ అరుదైన ప్రతిభ దొరికిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications