Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ ఖాయం: పాక్ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ కెరటం ఆటతీరుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఫిదా అయిపోయాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడంటూ కమ్రాన్ అక్మల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్
సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసిన ఈ కుర్రాడు.. మొత్తంగా 17 బంతుల్లో 52 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్‌తో కలిసి 75 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. 128 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలోనే పూర్తి చేయడంలో వైభవ్ సూర్యవంశీ ప్రధాన పాత్ర పోషించాడు.

Vaibhav Suryavanshi to Team India Soon Kamran Akmal Praises RR Youngster IPL 2026 Performance

కమ్రాన్ అక్మల్ ఏమన్నాడంటే?
ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన కమ్రాన్ అక్మల్.. వైభవ్ సూర్యవంశీ టాలెంట్ గురించి ప్రశంసలు కురిపించాడు. "కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే వైభవ్ సూర్యవంశీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ ఆడే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీకి ఖచ్చితంగా అవకాశం దక్కుతుంది" అని కమ్రాన్ అక్మల్ అన్నాడు. ఇంత చిన్నవయసులో వైభవ్‌కు ఉన్న గేమ్ అవేర్‌నెస్.. ప్రతి బంతిని ఎదుర్కొనే తీరు అద్భుతమని ఆయన ప్రశంసించాడు.

అండర్-19 వరల్డ్ కప్ హీరో
ఐపీఎల్‌కు ముందే వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోయింది. 2026 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఆ మెరుపులే అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేర్చాయి. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ టీమిండియా తలుపు తడుతున్నాడు.

మద్దతు తెలుపుతున్న మాజీ క్రికెటర్లు
వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలని మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా వంటి వారు మద్దతు తెలుపుతుండగా.. అంబటి రాయుడు వంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీపై అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడి పెంచవద్దని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికి భారత క్రికెట్లో స్టార్‌గా ఎదగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి టీమిండియా జెర్సీ దక్కుతుందో లేదో చూడాలి.

Story first published: Thursday, April 2, 2026, 11:44 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+