For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

211 బంతుల్లో 44 సిక్సర్లు, 466 పరుగులు!: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

Vaibhav Suryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే యూఏఈపై సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలోనే వైభవ్ ఏకంగా 466 పరుగులు చేశాడు.

అందర దృష్టి వైభవ్ పైనే..
ఈ టోర్నీలో మొదటి మ్యాచ్‌లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన వైభవ్.. శుక్రవారం సెమీస్ మ్యాచ్‌కు దిగుతున్న సందర్భంగా అందరి దృష్టి అతనిపైనే ఉంది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే ఈ కీలక మ్యాచ్‌లో ఈ 14 ఏళ్ల యువ బ్యాటర్ రాణించడం చాలా అవసరం. గత రెండు మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా ఆరంభం చేసిన వైభవ్ ఇప్పటికే తన బ్యాట్ నుంచి 44 సిక్సర్లు బాదాడు.

Vaibhav Suryavanshi Smashes 466 Runs in 211 Balls 44 Sixes at Age 14

భారత క్రికెట్ అభిమానులు నేడు మధ్యాహ్నం జరగనున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీ-ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ మొదటిసారిగా ఒక నాకౌట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. పాకిస్తాన్, ఒమన్‌లపై రాణించలేకపోవడం వైభవ్‌ను కలచివేసి ఉంటుంది. కావున సెమీఫైనల్లో బంగ్లాదేశ్ జట్టుపై తనదైన ముద్ర వేయాలని వైభవ్ భావిస్తున్నాడు. ఇండియా-ఏ జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్-ఏ జట్టుతో ఆడనుంది.

32 బంతుల్లోనే శతకం
వైభవ్ సూర్యవంశీ ఆటతీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వైభవ్ క్రీజులో నిలబడితే మ్యాచ్ ఏకపక్షంగా మారిపోతుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో యూఏఈపై వైభవ్ కేవలం 32 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. వైభవ్ 342 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేసి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అయితే ఆ తర్వాత అతను పాకిస్తాన్‌పై 45 పరుగులు, ఒమన్‌పై కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

వైభవ్ సూర్యవంశీ కెరీర్ గణాంకాలు
వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ కొద్ది మ్యాచ్‌లలోనే అతని బ్యాట్ నుంచి 44 సిక్సర్లు, 36 ఫోర్లు వచ్చాయి. వైభవ్ ఎదుర్కొన్న మొత్తం 211 బంతుల్లో 466 పరుగులు ఉన్నాయి.ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 220.85 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తాడు, ఇది అతన్ని అత్యంత డేంజరస్ బ్యాటర్‌గా నిరూపిస్తుంది.

టీ20లలో అతి చిన్న వయసులో రెండు సెంచరీలు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై శతకంతో టీ20 క్రికెట్‌లో రెండు సెంచరీలు చేసిన అతి చిన్న వయస్కుడైన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు గతంలో ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెక్‌కాన్ పేరిట (18 ఏళ్లు, 280 రోజులు) ఉండగా, వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 232 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు.

Story first published: Friday, November 21, 2025, 11:03 [IST]
Other articles published on Nov 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+