Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

14 ఏళ్లకే ఇంత టెన్షన్.. వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేసిన BCCI..!

Vaibhav Suryavanshi: భారత్‌లోని అత్యంత ప్రతిభావంతులైన యువ బ్యాటర్లలో ఒకడైన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ 14 ఏళ్ల యువ సంచలనం ఇప్పటికే తన ప్రతిభతో క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రాజస్థాన్ రాయల్స్‌తో ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి నేరుగా నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)కి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ కోసం ఒక ప్రత్యేక శిక్షణ షెడ్యూల్‌ను రూపొందించారు. దీనిలో ముఖ్యంగా టెక్నికల్ డ్రిల్స్, మ్యాచ్ పరిస్థితులపై దృష్టి సారించే విధంగా శిక్షణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కేవలం ఆస్ట్రేలియా పర్యటన కోసం కాదని.. భవిష్యత్తు కోసమని చెప్పారు. భారత క్రికెట్ భవిష్యత్ కోసం బీసీసీఐ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణమయని తెలిపారు. "సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవుతున్నందున వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాళ్లును సిద్ధం చేయాలి. ఈ శిక్షణ ఆ ప్రక్రియలో భాగమే. మేము ఒక్కొక్కరిని ఎంపిక చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన అన్ని నైపుణ్యాలలో వారిని నిష్ణాతులను చేస్తాం." అని మనీష్ ఓఝా వివరించారు.

Vaibhav Suryavanshi s Special Training for Australia Tour BCCI s Focus on Future Talent

తెల్ల బంతి నుంచి ఎర్ర బంతికి..
"వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడే బ్యాటింగ్ శైలి టీ20, వన్డే క్రికెట్లలో మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఐపీఎల్, అండర్-19, విజయ్ హజారే టోర్నమెంట్లలో ఈ ప్రతిభను చూశాం. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో వైభవ్ ప్రదర్శనలో స్థిరత్వం ఇంకా పెరగాలి" అని మనీష్ ఓఝా అభిప్రాయపడ్డారు. "వైభవ్ బలహీనత ఏంటంటే, తెల్ల బంతి క్రికెట్‌తో పోలిస్తే టెస్ట్ ఫార్మాట్‌లో అతని ప్రదర్శన స్థాయి తగ్గుతుంది. మా లక్ష్యం ఆ స్థిరత్వాన్ని మెరుగుపరచడమే. అతను 10 ఇన్నింగ్స్‌లు ఆడితే, కనీసం 7-8 ఇన్నింగ్స్‌లు ప్రభావవంతంగా ఉండాలి" అని మనీష్ ఓఝా అన్నారు.

వైభవ్ శిక్షణపై ప్రత్యేక దృష్టి
ఈ శిక్షణలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌తో పాటు అతని ఫిట్‌నెస్, ఫీల్డింగ్, ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇంకా టీనేజ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఒక కీలక దశలో ఉన్నాడు. సహజమైన టాలెంట్ ఇప్పటికే వైభవ్ సూర్యవంశీని నిలబెడుతోంది. కానీ పూర్తి స్థాయి అంతర్జాతీయ ఆటగాడికి ఎదగడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. బెంగళూరులోని ఈ శిక్షణ శిబిరం దాదాపు ఒక వారం పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వైభవ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు.

Story first published: Monday, August 11, 2025, 14:41 [IST]
Other articles published on Aug 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+