Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు? పూర్తి షెడ్యూల్ ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సరికొత్త రికార్డులతో విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం, 'బేబీ బాస్’ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రయాణం కొద్దిరోజుల పాటు ఐపీఎల్ వేదికగా ముగిసింది. క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవ్వడంతో ఫైనల్ చేరాలనే అతని కల చెదిరిపోయింది. అయితే ఈ సీజన్ మొత్తంలో తన అద్భుతమైన ఆటతీరుతో కోట్ల మంది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అంతర్జాతీయ వేదికపై ఎప్పుడు బరిలోకి దిగుతాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

వైభవ్ సూర్యవంశీ తన క్రికెట్ తదుపరి అధ్యాయాన్ని వచ్చే నెల అంటే జూన్ నుంచే ప్రారంభించబోతున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరగనున్న త్రైపాక్షిక (ట్రై సిరీస్) టోర్నీ కోసం ప్రకటించిన భారత్-ఎ జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌కు యువ సంచలనం తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

Vaibhav Suryavanshi Next Match Schedule India-A Squad and Tour Dates Announced Full Details

ఈ ట్రై సిరీస్ షెడ్యూల్ ప్రకారం జూన్ 9 (మంగళవారం) నాడు శ్రీలంక-ఎ జట్టుతో ఇండియా-ఎ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 11న ఆఫ్ఘనిస్తాన్-ఎ, జూన్ 15న మళ్లీ శ్రీలంక-ఎ, జూన్ 17న మరోసారి ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్లతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. జూన్ 21న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

కేవలం 12 ఏళ్ల ప్రాయంలోనే బీహార్ తరఫున రంజీ ట్రోఫీ బరిలోకి దిగి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తుంది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాదిన రోజే తాను సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌ను ఏలబోయే ఆటగాడినని వైభవ్ సూర్యవంశీ నిరూపించుకున్నాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌ను వైభవ్ సూర్యవంశీ పూర్తిగా తన పేరిట లిఖించుకున్నాడనే చెప్పాలి.

ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఎందరో అంతర్జాతీయ స్టార్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. ఈ సీజన్‌లో వైభవ్ ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ముఖ్యంగా చివరి రెండు నాకౌట్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 97 పరుగులు, గుజరాత్ టైటాన్స్‌పై 96 పరుగులు చేసి తృటిలో సెంచరీలు మిస్ చేసుకున్నాడు. ఒంటరి పోరాటంతో రాజస్థాన్ ఆశలు సజీవంగా ఉంచిన ఈ 'బేబీ బాస్' త్వరలోనే ఇండియా-ఎ జెర్సీలో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

ట్రై-సిరీస్‌కు ఎంపికైన ఇండియా-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, ప్రభుసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అన్షుల్ కాంబోజ్, అనుకుల్ రాయ్

Story first published: Saturday, May 30, 2026, 14:06 [IST]
Other articles published on May 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+