Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మస్తు రికార్డులు కొట్టిండు.. కానీ బుడ్డోడికి యమ సిగ్గు!!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. "ఐపీఎల్‌లో మొదటి బంతికే సిక్సర్, వేగవంతమైన సెంచరీ.. ఇలా మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసిన ఆ 14 ఏళ్ల కుర్రాడు.. తనను కలవడానికి వచ్చిన అభిమానులను చూసి సిగ్గుపడ్డాడు." అని అతని అండర్-19 జట్టు సహచరుడు విహాన్ మల్హోత్రా వెల్లడించారు. ఈ సంఘటన వైభవ్ సూర్యవంశీలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేసింది.

వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం
బీహార్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున రూ.1.1 కోట్లకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒప్పందం చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే.. మొదటి మ్యాచ్‌లోనే మొదటి బంతికి సిక్సర్ కొట్టి తన రాకను ఘనంగా చాటాడు. ఆ తర్వాత, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సీజన్‌లో కేవలం 7 ఇన్నింగ్స్‌లలో 206 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని చూపించాడు.

Vaibhav Suryavanshi IPL Record Breaker With a Shy Smile 14-Year-Old Wonder Wins Hearts

అభిమానుల ముందు సిగ్గుపడ్డ వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్‌పై జరిగిన సిరీస్‌లో భారత్ అండర్-19 జట్టు తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడ కూడా తన దూకుడును కొనసాగించాడు. 5 మ్యాచ్‌లలో 355 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఆ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను విహాన్ మల్హోత్రా వివరించారు. "మేము ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు, కొంతమంది వైభవ్ అభిమానులు రాజస్థాన్ రాయల్స్ జెర్సీలు వేసుకుని, అతన్ని కలవడానికి 6 గంటలు ప్రయాణించి వచ్చారు. 'వైభవ్‌ను పిలవండి' అని వారు అడిగారు. కానీ అతను వారిని చూసి చాలా సిగ్గుపడ్డాడు. జట్టులో అతనే అందరికంటే చిన్నవాడు కాబట్టి, మేమంతా అతన్ని ఒక చిన్న పిల్లవాడిలా చూసుకుంటాము" అని విహాన్ అన్నారు.

అంతే కాకుండా వైభవ్ బ్యాటింగ్‌ను దగ్గరగా చూసిన అనుభవాన్ని కూడా విహాన్ మల్హోత్రా పంచుకున్నారు. "ఒక మ్యాచ్‌లో నేను, వైభవ్ కలిసి 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాం. మేమిద్దరం సెంచరీలు సాధించాము, కానీ వైభవ్ మాత్రం ఏకంగా 10 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ బ్యాటింగ్ నాలో మరింత కష్టపడాలనే ప్రేరణ కలిగించింది" అని తన జూనియర్ గురించి విహాన్ ప్రశంసించారు. ఈ సంఘటనలు వైభవ్ సూర్యవంశీ కేవలం మైదానంలోనే కాకుండా, బయట కూడా తన స్వభావంతో అభిమానుల మనసులను గెలుచుకుంటున్నారని చూపిస్తున్నాయి.

Story first published: Sunday, August 31, 2025, 17:14 [IST]
Other articles published on Aug 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+