Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరాజ్, బుమ్రా, భువీ.. ఎవరైతే నాకేంటి? బంతి పడిందా.. బౌండరీకి వెళ్లిందా!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ తన దూకుడుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాధారణంగా బ్యాటర్లు క్రీజులోకి రాగానే పిచ్ పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తాను ఎదుర్కొనే మ్యాచ్‌లోని మొదటి బంతికే బౌండరీ బాదడం ఈ కుర్రాడికి అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఏకంగా 6 సార్లు మ్యాచ్ ప్రారంభమైన తొలి బంతికే బౌండరీ కొట్టి రికార్డు సృష్టించాడు.

ప్రపంచ అత్యుత్తమ బౌలర్లకే చుక్కలు
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యంత డేంజరస్ బౌలర్లుగా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి వారిని కూడా వైభవ్ వదలలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతికే భారీ సిక్సర్ బాదిన ఈ కుర్రాడు.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్‌తో తన ఖాతాను ప్రారంభించాడు. ఇక సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ లెంగ్త్ బంతిని కూడా ఆర్సీబీపై ఫోర్‌గా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Vaibhav Suryavanshi IPL 2026 The 15-Year-Old Prodigy Dominating Bumrah and Siraj with Sixes

అరంగేట్రం నుంచే అదే జోరు
వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఈ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అరంగేట్రం చేసిన వైభవ్.. శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అదే సీజన్‌లో కేకేఆర్ బౌలర్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో కూడా ఫోర్‌తో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మాట్ హెన్రీని సైతం తొలి బంతికే ఫోర్ కొట్టి తన అటాకింగ్ మైండ్‌సెట్‌ను నిరూపించుకున్నాడు.

బౌలర్లను ఒత్తిడిలో నెట్టడమే వైభవ్ లక్ష్యం
వైభవ్ సూర్యవంశీ అనుసరిస్తున్న ఈ వ్యూహం ప్రత్యర్థి బౌలర్లను వెంటనే రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేస్తోంది. ఎదురుగా ఉన్నది ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా సరే ఏమాత్రం భయం లేకుండా బ్యాట్ ఝులిపించడం ఈ వండర్ కిడ్ ప్రత్యేకత. కేవలం 15 ఏళ్ల వయసులోనే బుమ్రా వంటి బౌలర్లపై సిక్సర్లు బాదుతున్న వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా మారుతున్నాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Saturday, April 11, 2026, 7:38 [IST]
Other articles published on Apr 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+