Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ నుంచి వైభవ్ సూర్యవంశీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్!

గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 202 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాట్ ఝులిపించిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు బాది చరిత్ర సృష్టించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా.. ఐపీఎల్ తదుపరి సూపర్ స్టార్ తానేనని ప్రపంచానికి చాటిచెప్పాడు

ఆరెంజ్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఈ పవర్‌ఫుల్ ఇన్నింగ్స్‌కు గానూ వైభవ్ సూర్యవంశీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. అంతేకాకుండా ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 15 బంతుల్లోనే రెండు సార్లు అర్థ సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. ఇదే సీజన్లో అంతకు ముందు సీఎస్కేపై కూడా వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదడం విశేషం.

Vaibhav Suryavanshi IPL 2026 Orange Cap POTM and a Special Gift from King Virat Kohli

విరాట్ ప్రత్యేక కానుక
మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుత క్షణం ఎదురైంది. టీమిండియా దిగ్గజం, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వైభవ్ ప్రతిభను అభినందిస్తూ ఓ ప్రత్యేకమైన కానుకను అందించాడు. వైభవ్ సూర్యవంశీ ధరించిన క్యాప్‌పై విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా.. దానిపై "వెల్ డన్ వైభవ్" అని రాసి ప్రోత్సహించాడు. మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. ఓ యువ ప్రతిభను కోహ్లీ గౌరవించిన తీరు క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది.

రికార్డులను సమం చేసిన వైభవ్
ఈ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరిన్ని రికార్డులను సమం చేశాడు. పవర్‌ప్లేలోనే మూడుసార్లు అర్థ సెంచరీలు బాదిన ఆటగాడిగా జోస్ బట్లర్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురేల్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన 108 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కూడా సిక్సర్ బాది తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ఈ వండర్ కిడ్ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. యువ సంచలనం వైభవ్ దూకుడు చూస్తుంటే భారత క్రికెట్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Saturday, April 11, 2026, 8:11 [IST]
Other articles published on Apr 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+