Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చోటాభీమ్‌కు గాయం.. అలాగైతే IPL నుంచి ఔట్!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిని ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో అకస్మాత్తుగా వైభవ్ తొడ కండరాలు పట్టేశాయి. నొప్పితో విలవిలలాడిన వైభవ్ సూర్యవంశీ కనీసం అడుగు కూడా వేయలేకపోయాడు. చివరకు ఫిజియోలు, సహాయక సిబ్బంది సాయంతో ఇద్దరు వ్యక్తులు వైభవ్‌ను భుజాలపై డగౌట్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూసిన రాజస్థాన్ రాయల్స్ అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

నేడు కీలక పరీక్షలు..గ్రేడ్-3 అయితే కష్టమే!
వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రతను అంచనా వేయడానికి వైద్య బృందం ఇవాళ స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఇది కండరాల సంబంధిత గాయం అని తెలుస్తోంది. ఒకవేళ ఈ గాయం 'గ్రేడ్-3' పరిధిలోకి వస్తే, కండరాలు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 వారాల (2 నెలల) సమయం పట్టే అవకాశం ఉంది. అలా జరిగితే, ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వైభవ్ అందుబాటులో ఉండటం అసాధ్యమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Vaibhav Suryavanshi Injury Update Will the Rajasthan Royals Star be Ruled Out of IPL 2026 Details

రాజస్థాన్ రాయల్స్ ప్లాన్స్ దెబ్బతిన్నట్టేనా?
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పవర్ ప్లేలో మెరుపు వేగంతో పరుగులు రాబడుతూ రాజస్థాన్ జట్టుకు శుభారంభాలను ఇస్తున్నారు. అండర్-19 లెవల్ నుంచి నేరుగా ఐపీఎల్ వేదికపై తనదైన ముద్ర వేసిన ఈ యువ ప్లేయర్ దూరం కావడం రాజస్థాన్ రాయల్స్‌కు కోలుకోలేని దెబ్బ. వైభవ్ సూర్యవంశీ జట్టు నుంచి వైదొలిగితే, ఓపెనింగ్ స్థానంలో ఎవరిని ఆడించాలనేది జట్టు యాజమాన్యానికి పెద్ద సవాల్‌గా మారనుంది.

వైభవ్ సూర్యవంశీ కెరీర్‌పై ప్రభావం
అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్న వైభవ్‌ సూర్యవంశీకి ఇది అత్యంత కీలకమైన సమయం. ఇలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడు గాయపడటం ఈ యువ ప్లేయర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశం. ప్రస్తుతానికి అభిమానులంతా ఆ గ్రేడ్-3 గాయం కాకూడదని, త్వరగా కోలుకుని అతను తిరిగి క్రీజులోకి రావాలని కోరుకుంటున్నారు. వైద్య పరీక్షల నివేదిక వెలువడితే తప్ప.. అతని భవిష్యత్తు, ఈ ఐపీఎల్ సీజన్ కొనసాగింపుపై స్పష్టత రాదు.

Story first published: Sunday, April 26, 2026, 9:26 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+