Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడు పాపం.. మళ్లీ రెండో బంతికే..!

Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీని తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు ఆడి ఔటయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ విషయంలో ఇలాంటిదే జరిగింది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. అయితే కేకేఆర్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మొదటి బంతికే ఫోర్ కొట్టి తన ఖాతా తెరిచాడు కానీ తర్వాతి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ విధంగా వైభవ్ ఇన్నింగ్స్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ముగిసింది. వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రాణించలేకపోవడం ఆ జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది.

Vaibhav Suryavanshi Fails Again After Blazing Century Back-to-Back Disappointments

బ్యాటింగ్‌లో కేకేఆర్ అద్భుతాలు
రాజస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ దంచికొట్టాడు. కేకేఆర్ తరఫున ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో రస్సెల్ 6 సిక్సర్లు, 5 ఫోర్లు కూడా కొట్టాడు. రస్సెల్‌తో పాటు అంగ్‌క్రిష్ రఘువంశీ కూడా రాణించాడు. రఘువంశీ 31 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

ఈ ఇద్దరితో పాటు కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా. రెహ్మానుల్లా గుర్బాజ్ 35 పరుగులు చేయగా.. రింకూ సింగ్ 6 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ విధంగా కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. బౌలింగ్ విషయానికొస్తే రాజస్తాన్ తరఫున జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, కెప్టెన్ రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, May 4, 2025, 18:40 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+