Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డగౌట్‌లో ఒంటరిగా కూర్చుని వెక్కివెక్కి ఏడ్చిన వైభవ్! (వీడియో)

ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా చాలా ప్రశాంతంగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. తన జట్టును ఫైనల్ కు చేర్చలేకపోయాననే బాధ వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించి తన జట్టును ఐపీఎల్ 2026 ఫైనల్‌కు చేర్చాడు. క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో ఆర్సీబీతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ రెండు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

ఈ సీజన్ రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓ కలలా సాగింది. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో మొత్తం 776 పరుగులు చేసి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. అయితే ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ.. తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీన అందించలేకపోయాననే నిరాశ అతడిని వెంటాడింది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ చరిత్రలో ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడో సారి. ఇదివరకు 2022లో తమ అరంగేట్రం సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్ గెలిచిన గుజరాత్.. 2023లో కూడా ఫైనల్‌కు చేరి సీఎస్కే చేతిలో ఓడిపోయింది.

Vaibhav Suryavanshi Cries in Dugout After Rajasthan Royals Loss vs Gujarat Titans in IPL 2026 Qualifier2

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభం చాలా పేలవంగా సాగింది. కేవలం 9 పరుగులకే యశస్వి జైస్వాల్ (1), ధ్రువ్ జురేల్ (7) వికెట్లను కోల్పోయింది. అయితే ప్రారంభ వికెట్లు పడినా రాజస్థాన్ అద్భుతంగా పుంజుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్, కగిసో రబాడ చెరో 2 వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు.

కష్టాల్లో పడిన రాజస్థాన్ రాయల్స్‌ను వైభవ్ సూర్యవంశీ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించాడు. స్టేడియం నలుమూలలా షాట్లు ఆడుతూ కేవలం 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 96 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా వైభవ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. జడేజా 35 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. చివరి ఓవర్లలో డోనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు.

Story first published: Saturday, May 30, 2026, 9:48 [IST]
Other articles published on May 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+