Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ: 17 ఏళ్ల ప్రపంచ రికార్డు బ్రేక్!

Vaibhav Suryavanshi: భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ యూఏఈతో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో సంచలనం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో ఏకంగా 171 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీని కొద్దిలో కోల్పోయినప్పటికీ.. వైభవ్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 17 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. భారత్ ఇన్నింగ్స్‌లోని 33వ ఓవర్‌లో ఉదిశ్ సూరి బౌలింగ్‌లో ఔటయ్యే సమయానికి వైభవ్ తన పనిని పూర్తి చేశాడు.

సిక్సర్ల రికార్డు బ్రేక్
అండర్-19 వన్డే మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 2008లో నమీబియాపై ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ హిల్ 12 సిక్సర్లతో 124 పరుగులు చేసి నెలకొల్పిన 17 ఏళ్ల రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. యూఏఈపై వైభవ్ 14 సిక్సర్లు కొట్టి కొత్త ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇది ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా.

Vaibhav Suryavanshi Creates History Breaks 17-Year-Old World Record with 14 Sixes

అంబటి రాయుడు రికార్డుకు 6 పరుగుల తేడా
అండర్-19 వన్డే మ్యాచ్‌లలో భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును వైభవ్ సూర్యవంశీ కొద్దిలో కోల్పోయాడు. 2002లో ఇంగ్లాండ్‌పై అంబటి రాయుడు 177 పరుగులు (114 బంతులు) చేసి ఈ రికార్డును ఇప్పటికీ పదిలంగా ఉంచాడు. వైభవ్ కేవలం 6 పరుగుల తేడాతో రాయుడు రికార్డును అధిగమించలేకపోయాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఉన్ముక్త్ చంద్ (2012), అర్జున్ ఆజాద్ (2019) పాకిస్తాన్‌పై 121 చొప్పున పరుగులు చేశారు.

కొద్దిసేపట్లోనే మరొక రికార్డు బ్రేక్
వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచినప్పటికీ, దురదృష్టవశాత్తు కొద్దిసేపటికే అతని రికార్డును పాకిస్తాన్ ఆటగాడు సమీర్ మిన్హాస్ బద్దలు కొట్టాడు. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో సమీర్ మిన్హాస్ 177 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో వైభవ్ రికార్డును అధిగమించాడు. ఈ టోర్నమెంట్‌లో యువ ఆటగాళ్ల విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ రాబోయే అండర్-19 ప్రపంచ కప్ కోసం బలమైన సంకేతాలు పంపాడు.

Story first published: Friday, December 12, 2025, 14:32 [IST]
Other articles published on Dec 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+