For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రేజ్ అంటే ఇది.. బుడ్డోడి కోసం ఆరు గంటలు ప్రయాణించి..!

Vaibhav Suryavanshi: భారత్‌కు చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఈ చిచ్చర పిడుగు నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ -19 వన్డే యూత్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి 355 పరుగులు వచ్చాయి. నాలుగో వన్డే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 143 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో వైభవ్ కేవలం 52 బంతుల్లో అండర్-19 వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్ గులాం రికార్డును బ్రేక్ చేశాడు. యూత్ వన్డేల్లో కమ్రాన్ గులాం 2013లో 53 బంతుల్లో సెంచరీ చేయగా..వైభవ్ 52 బంతుల్లోనే శతకం బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అండర్-19లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ శాంటో(14 ఏళ్ల 241 రోజులు ) పేరిట ఉన్న రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. ఈ శతకం బాదిన సమయానికి వైభవ్ సూర్యవంశీ వయస్సు 14 ఏళ్ల 100 రోజులే కావడం గమనార్హం.

క్రేజ్ మామూలుగా లేదుగా..

ఐపీఎల్‌లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ పట్ల అభిమానం భారత్‌లోనే కాదు.. ఇంగ్లాండ్‌లో కూడా విస్తరించింది. అభిమానులు కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు చాలా దూరం నుంచి స్టేడియాలకు వస్తున్నారు. ప్రస్తుత భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్‌లోనే ఉన్న వైభవ్ సూర్యవంశీని కలిసేందుకు ఇద్దరు అభిమానులు దాదాపు 6 గంటల పాటు ప్రయాణించి మరీ వచ్చారు. ఇద్దరు అమ్మాయిలు వైభవ్‌తో ఫోటో దిగేందుకు చాలా కష్టపడి వచ్చినట్లు తెలిపారు. ఆ అమ్మాయిలు రాజస్థాన్ రాయల్స్ జెర్సీలు ధరించి వచ్చి వైభవ్ తో కలిసి ఫోటోలు దిగారు. అభిమానుల స్టోరీని రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Vaibhav Suryavanshi Craze Fans Travel 6 Hours to Meet 14-Year-Old Record-Breaking Star

రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ, "వీరిద్దరు బెస్ట్ ఫ్యాన్స్ అనేందుకు ఇంకేం రుజువు కావాలి. 6 గంటలు డ్రైవ్ చేసి వోర్సెస్టర్‌కు వచ్చారు, పింక్ జెర్సీ ధరించారు. వైభవ్, టీమిండియా కోసం ఉత్సాహపరిచారు. అన్యా, రివా వైభవ్ వయస్సువారే. వారికి ఈ రోజు చిరస్మరణీయం" అని రాజస్థాన్ రాయల్స్ రాసుకొచ్చింది. రాసింది.

3-2తో సిరీస్ గెలిచిన భారత్
వైభవ్ సూర్యవంశీ భారీ ఇన్నింగ్స్‌ల వల్ల భారత్ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ మినహా వైభ ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చి ఇంగ్లీష్ బౌలర్లను బాగా ఎదుర్కొన్నాడు. అంతకు ముందు వైభవ్ పేరు ఐపీఎల్ 2025లో చర్చలోకి వచ్చింది. ఎందుకంటే వైభవ్ కేవలం 13 ఏళ్ల వయస్సులో కాంట్రాక్టు పొందిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టుపై 35 బంతుల్లో సెంచరీ సాధించి టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయస్సులో సెంచరీ సాధించిన చరిత్రను సృష్టించాడు.

Story first published: Thursday, July 10, 2025, 13:50 [IST]
Other articles published on Jul 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+